నారా లోకేష్ పాదయాత్రలో సూపర్ ట్విస్ట్... వారంతా కలిశారు??

అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి జగన్ కు చేతకాదని, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేస్తామని లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారు.

యువగళం పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తోన్న పాదయాత్ర 32వ రోజుకు చేరుకుంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గుమ్మడివారి ఇండ్లు విడిది కేంద్రం నుంచి తిరిగి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బందార్లపల్లెలో రోడ్లపై గుంతలున్నాయని, వీటివల్ల ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు చెప్పారు. గుంతలు పూడ్చకుండా రోడ్లు వేయడం, అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి జగన్ కు చేతకాదని, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.

లోకేష్ ను కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయులు

లోకేష్ ను కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయులు


పాదయాత్రలో ఉన్న లోకేష్ ను నోబుల్ టీచర్స్, యూటీఎఫ్ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. సీపీఎస్ రద్దు విషయంలో మాట తప్పారని, ప్రాథమిక విద్య రెండు సంవత్సరాలకు, మాధ్యమిక విద్య మూడు సంవత్సరాలకు కుదించారని, దీనివల్ల విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదముందంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఇంతవరకు డీఎస్సీ నిర్వహించలేదని, ఒక కిలోమీటరు దూరంలోపు ఉన్న పాఠశాలలను విలీనం చేయడంవల్ల మారుమూల గ్రామాల్లోని పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే ప్రమాదముందన్నారు. 10 మంది విద్యార్థులకన్నా తక్కువ ఉన్న 1500 పాఠశాలలను నేడో, రేపో మూసేయాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు.

గురువులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారు..

గురువులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారు..

రాష్ట్రం ప్రభుత్వ ఉపాధ్యాయులను వేధించడమే పనిగా పెట్టుకుందని, డిమాండ్ల సాధన కోసం పోరాడుతుంటే వారిపై కేసులు బనాయించడం నియంతృత్వ పోకకడలకు నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి నిలదీసేవారిని రకరకాలుగా వేధించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. భావి భారత పౌరులను తయారుచేసే గురువులను దొంగలుగా చిత్రీకరిస్తూ తప్పుడు కేసులు బనాయించడం చాలా దారుణమని నారా లోకేష్ మండిపడ్డారు. తన చరిత్రలో మద్యం దుకాణాలవద్ద ప్రభుత్వ టీచర్లను కాపలాగా పెట్టిన పనికిమాలిన ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు.

టీచర్లకు అండగా టీడీపీ ఉంటుంది

టీచర్లకు అండగా టీడీపీ ఉంటుంది

హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉపాధ్యాయులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేస్తామని, వారి న్యాయబద్ధమైన డిమాండ్లను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. వారిపై టీడీపీ ప్రభుత్వ అనవసర వేధింపులు, కక్ష సాధింపుల్లాంటివి ఉండవన్నారు. టీచర్ల సేవలను సమర్థవంతంగా వినియోగించుకొని మెరుగైన విద్యా ప్రమాణాలను నెలకొల్పుతామన్నారు. 4వేల కిలోమీటర్ల పాదయాత్రను 400 రోజుల్లో పూర్తిచేసే ఉద్దేశంతో యువత ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యలను గుర్తిస్తూ లోకేష్ ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. కుప్పంలో ప్రారంభమైన యాత్ర ఇచ్ఛాపురంలో ముగియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+