కేవీపీ బిల్లుకు టీడీపీ మద్దతు : హోదా కోసం పార్టీలకు అతీతంగా..
విజయవాడ : విజయవాడలో శుక్రవారం నాడు సమావేశమైన టీడీపీ పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా నిమిత్తం కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టబోయే ప్రైవేటు బిల్లుకు మద్దతునివ్వాలని పార్టీ సమావేశంలో తీర్మానించారు.

కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టబోతున్న ఈ ప్రైవేటు బిల్లు ఓటింగు వరకు వస్తే.. బిల్లుకు మద్దతునివ్వాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు అధినేత చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి ఎలాంటి బేషజాలకు తావు లేకుండా బిల్లుకు ఎంపీలందరు మద్దతునివ్వాలని సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించినట్టుగా తెలుస్తోంది.
అంతేకాదు, పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు గొంతెత్తినా.. వారికి మద్దతు పలకాలని ఎంపీలను చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications