సర్వే: వివరాలకు పవన్ కళ్యాణ్, విజయశాంతి నో
హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ సహకరించలేదు. అదేవిధంగా, మాజీ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ రాములమ్మ కూడా వివరాలను ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ మేరకు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
వారి నుంచి మరోసారి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తామని హైదరాబాదులోని వారి ప్రాంతాలకు వెళ్లిన ఎన్యుమరేటర్లు చెప్పినట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. విజయశాంతి కూడా కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు.

ఇదిలావుంటే, హైదరాబాదు నగరంలో 30 శాతం వరకు సర్వే పూర్తయిందని, మొత్తం సర్వేను ఈ రోజే పూర్తి చేస్తామని జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ చెప్పారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని అన్నారు. సర్వేపై పూర్తి వివరాలను గవర్నర్‌కు అందించినట్లు తెలిపారు.
సమగ్ర సర్వేలో ఏ విధమైన ఇబ్బందులు లేవని, ఉదయం 7 గంటలకే సర్వే ప్రారంభమైందని చెప్పారు. సర్వేతో పాటు ఇబ్బంది పడుతున్న ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications