అఫైర్ అనుమానం: భార్యకు ఉరేసి, విషం తాగించి...

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి: తన భార్యను చంపడానికి కట్టుకున్న భర్త ప్రయత్నాలు చేశాడు. తొలుత ఆమెకు ఉరేశాడు. దాంతో చనిపోలేదని తెలుసుకుని ఆమె చేత విషం తాగించాడు. భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో అతను ఆ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

ఈ సంఘటన అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలో గురువారం రాత్రి జరిగింది. విషం తాగించి ఊపిరాడకుండా చేశాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వారు ఇలా జీవిస్తున్నారు..

వారు ఇలా జీవిస్తున్నారు..

నంబులపూలకుంట మండలం పెడబల్లికి చెందిన డేరంగుల లక్ష్మయ్యకు 15 ఏళ్ల క్రితం తనకల్లు మండలం కొర్తికోటకు చెందిన సరస్వతితో వివాహమైంది. వారికి సంతానం కలగలేదు. కూలి పనులు చేసుకుంటూ వారిద్దరు జీవనం సాగిస్తున్నారు.

భార్యపై అనుమానం కలిగింది..

భార్యపై అనుమానం కలిగింది..

భార్యపై లక్ష్మయ్యకు రెండేళ్ల క్రితం అనుమానం కలిగింది. వేరే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి తరచూ గొడవ పడేవాడు. చిత్రహింసలకు గురిచేశాడు. ఎవరు చెప్పినా అతను వినలేదు.

అర్థరాత్రి ఇలా చేశాడు..

అర్థరాత్రి ఇలా చేశాడు..

మద్యం తాగి గురువారం అర్ధరాత్రి వచ్చిన లక్ష్మయ్య నిద్రిస్తున్న భార్య గొంతుకు ఆమె చీరకొంగుతో ఉరివేశాడు. ప్రాణం పోయిందని లేచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి వచ్చి చూస్తే ఆమె ప్రాణంతో ఉందని తెలిసిందే. దీంతో నోట్లో విషం పోసి ఊపిరి ఆడకుండా చేశాడు.

చావుబతుకుల మధ్య ఆమ..

చావుబతుకుల మధ్య ఆమ..

శుక్రవారం ఉదయం ఆమె చావుబతుకుల మధ్య ఉండడాన్ని పక్కింటివారు గుర్తించారు. వెంటనే ఆమె పినతల్లి చిన్న రవణమ్మకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగాా ఉండడంతో వైద్యులు తిరుపతికి పంపించాలని సూచించారు. అయితే ఆర్థిక స్థోమత, సహాయకులు లేకపోవడంతో మదనపల్లెలోనే ఆమెకు చికిత్స చేయిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man in Ananthapur district of Andhra Pradesh atempted to kill his wife.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి