అనుమానాస్పద స్థితిలో నర్సు మృతి: ప్రేమ వ్యవహారమే

Suspicious death of girl in Krishna district
విజయవాడ: కృష్ణా జిల్లా తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తాడేపల్లి పట్టణంలో మంగళవారం రాత్రి ఓ వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్రపాలేనికి చెందిన సింతల జ్యోతి తాడేపల్లిలోని కార్పోరేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

విజయవాడ కేదారేశ్వరిపేటలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ విధులకు వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో తాడేపల్లి మహానాడుకు చెందిన రవిశంకర్‌తో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో ఎనిమిది నెలల క్రితం అతన్ని పెళ్లి చేసుకుంది.

రవిశంకర్ విజయవాడలోని ఓ స్టీల్ దుకాణంలో పనిచేస్తుంటాడు. వీరు మహానాడు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇంటి ముందు జ్యోతి కుప్పకూలిపోవడంతో భర్త రవిశంకర్ మణిపాల్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు.

వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మరణించినట్లు తేల్చారు. కాగా, తన కూతురు జ్యోతిని కట్నం కోసం వేధింపులకు గురి చేశారని తండ్రి తాళ్లూరి శ్రీనివాస రావు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కులం పేరుతో తన కూతురిని దూషించేవారని, తన కూతురిని విషమిచ్చి చంపారని వారు ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+