షిర్డీ సాయి ఏం చేశాడు: భక్తులకు ప్రశ్నలు సంధించిన స్వరూపానంద
విజయవాడ: షిర్డీ సాయిబాబా దేవుడే కాదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మరోసారి అన్నారు. షిర్డీ సాయి భక్తులు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు. హైదరాబాదులోని షిర్డీ సాయిబాబా దేవాలయం వద్ద భక్తులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
దాంతో స్వరూపానంద మరోసారి శుక్రవారం మరోసారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను సమర్థించుకున్నారు. ఏ తప్పులు చేసినా తమ వద్దకు వస్తే పాపాలన్నీ నశిస్తాయని చమత్కారులు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
చాంద్‌మియానే షిర్డీ సాయిబాబాగా పూజిస్తున్నారని ఆయన చెప్పారు. దేశం పరాయి పాలనలో మగ్గుతున్న్పప్పుడు సాయిబాబా జన్మించాడని చెబుతూ దేశాన్ని విముక్తం చేశాడా అని ఆయన అడిగారు. లాతూరు కరువు వచ్చినప్పుడు షిర్డీ సాయిబాబా ఏమీ చేయలేదని విమర్సించారు.

షిర్డీ సాయిబాబాను పూజించినా కూడా మహిళలపై దాడులు ఆగడం లేదని చెప్పారు. దేశంలో మద్యపానం, డ్రగ్స్ అలవాటు పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అలవాటు నుంచి తాము యువతను రక్షిస్తున్నామని ఆయన చెప్పారు. సాయి రామాయణం, సాయి చాలీసా సృష్టించారని ఆయన చెప్పారు. సాయి భక్తుల నుంచి హిందూ మతాన్ని అప్రమత్తం చేస్తున్నామని స్పష్టం చేశారు.
షిర్డీ సాయిబాబా దేవుడే కాదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మరోసారి అన్నారు. షిర్డీ సాయి భక్తులు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు. హైదరాబాదులోని షిర్డీ సాయిబాబా దేవాలయం వద్ద భక్తులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications