టి, ఢిల్లీ ఘటన: కిరణ్‌కు టి మంత్రుల సహాయ నిరాకరణ

ఈ నేపథ్యంలో దానికి నిరసనగా ఈ బడ్జెట్ సమావేశాలకు సహకరించకూడదనే ఆలోచనలో వారు ఉన్నట్టు తెలుస్తోంది. సభలో నిరసన వ్యక్తం చేయాలా లేక పూర్తిగా దూరంగా ఉండాలా అనే విషయమై వారు చర్చిస్తున్నారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సోమవారం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు శాసన సభలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజులు ఉంటాయి. పదో తేది నుండి 13వ తేదీ వరకు జరుగుతాయి. తొలి రోజున బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత సభ వాయిదా పడనుంది. తర్వాత రోజు సెలవు ఉంటుంది.
ఆ తరువాత 12వ తేదిన ఉదయం సభ ప్రారంభమై బడ్జెట్ పైన చర్చిస్తుంది. సోమవారం డ్జెట్ ప్రవేశ పెట్టడానికి గంట ముందు మంత్రివర్గం సమావేశమవుతుంది. బడ్జెట్ మంత్రివర్గం ఆమోదించిన తర్వాత సభలో ప్రవేశ పెడతారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అంగన్ వాడి కార్యకర్తలకు కనీస వేతనం అందచేయాలని, అంగన్ వాడీ కేంద్రాల్లో నాణ్యమైన గుడ్లు పంపిణీ చేయాలని వారు కోరారు.
కాగా, విభజన బిల్లు మొదట రాజ్యసభకు రానున్న నేపథ్యంలో, సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజ్యసభకు వచ్చి తమ సమైక్యవాణి వినిపించాలని టిడిపి ఎంపీ సిఎం రమేష్ డిమాండ్ చేశారు. సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న టిడిపి ఎంపీలను సస్పెండ్ చేసి బిల్లును ఆమోదింపజేసుకోవాలనే కుటిల యత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి దాకా వెల్‌లోకి రాని కాంగ్రెస్ సభ్యులు తమతో కలసి రావాలన్నారు.












Click it and Unblock the Notifications