Tadepalligudem Assembly Election 2024 Results LIVE: తాడేపల్లిగూడెం తీర్పు!!
తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారాలు: వర్తక, వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెం రాజకీయాలకు కూడా కేరాఫ్. పశ్చిమగోదావరి జిల్లా నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెం ఓటర్లు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఊహించడం చాలా కష్టం. తాడేపల్లిగూడెం ప్రజలకు ప్రధాన పార్టీలైన వైసిపీ, కాంగ్రెస్, బిజెపి, ప్రజారాజ్యం పార్టీలను కూడా ఆదరించిన చరిత్ర ఉంది. తాడేపల్లిగూడెంలో ఈసారి ప్రజలు ఎవరికి జై కొట్టబోతున్నారు? కొట్టు సత్యనారాయణ వర్సెస్ బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య జరిగిన ప్రచ్చన్న సమరంలో తాడేపల్లిగూడెం ప్రజలు తేల్చిందేంటి?
కొట్టు సత్యన్నారాయణ వర్సెస్ బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి తాడేపల్లిగూడెంలో టిడిపి బిజెపి జనసేన పొత్తుల లో భాగంగా జనసేనకు టికెట్ కేటాయించారు.పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తాడేపల్లిగూడెం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత జిల్లా కావడంతో జనసేనకి టికెట్ కేటాయించారు. జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, వైసీపీ నుంచి మళ్లీ పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పైన పోరా హోరీగా పోరాటం చేశారు.

గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొట్టు విజయం
తాడేపల్లిగూడెం శాసనసభ స్థానంలో 13మంది పోటీలో ఉండగా ప్రధాన పోటీ వైసీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి కోట్టు సత్యనారాయణ జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ల మధ్యే నెలకొంది. 2019ఎన్నికల్లో చూస్తే వైసీపీ నుంచి పోటీ చేసిన కొట్టు సత్యనారాయణ విజయం సాధించారు. ఆయన గత ఎన్నికల్లో 70,741ఓట్లను సాధించారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ఎలి వెంకట మధుసూదన్ రావు అలియాస్ నాని 54,275ఓట్లను సాధించారు.
కాపు సామాజిక వర్గానిదే మెజార్టీ ఓటు బ్యాంకు
2019లో జనసేన నుంచి పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ 36 వేల 197 ఓట్లను సాధించారు. 2019 ఎన్నికలలో 16,466 ఓట్ల మెజారిటీతో కొట్టు సత్యనారాయణ విజయం సాధించి డిప్యూటీ సీఎం గా అవకాశం దక్కించుకున్నారు. ప్రధానంగా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న తాడేపల్లిగూడెంలో టిడిపి కూటమి, వైసిపి కాపు సామాజిక వర్గ నేతలని ఎన్నికల బరిలోకి దింపాయి.
కొట్టు ధీమా ఇదే
తాడేపల్లిగూడెం ను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని చెబుతున్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, తాము చేసిన పనులే మళ్లీ తమను గెలిపిస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. జగన్ అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని చూసిన జనం తమకే పట్టం కడతారని గట్టి నమ్మకంతో ఉన్నారు.
బొలిశెట్టి నమ్మకం ఇలా
అయితే తాడేపల్లి గూడెం నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ ఉందని, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఆయన అనుచరుల అవినీతి చూసి విసిగిపోయిన ఓటర్లు తమకు పట్టం కడతారని గట్టి నమ్మకంతో ఉన్నారు టిడిపి కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. అంతేకాదు గత ఎన్నికలలో టిడిపి, జనసేన ఓట్లను పంచుకున్నారని, ఈసారి టిడిపి, జనసేన, బిజెపి ఓటు బ్యాంకు కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన తనకే పడుతుందని, విజయం తధ్యమని గట్టి నమ్మకంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications