ఎవరు గెలవాలన్నా తమిళ తంబీలు ఆశీర్వదించాలి, చంద్రబాబు అయినా, మేడమ్ రోజా అయినా !

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిలు జరగుతున్నా ఓ జిల్లాలో మాత్రం తమిళ వాసన గుమగుమలాడుతోంది. చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో టీడీపీ, వైసీపీ నాయకుల గెలుపోటములు తమిళ తంబీల చేతుల్లోనే ఉన్నాయని స్పష్టంగా వెలుగు చూసింది. మేడమ్ రోజా గెలవాలన్నా తమిళ తంబీలు కరుణించాల్సిందే.

తమిళనాడు సరిహద్దులోనే చిత్తూరు జిల్లా ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన లక్షలాది మంది వివిద కారణాలతో చెన్నైతో పాటు వేలూరు, కోయంబత్తూరు. ఆంబూరు, సేలం, క్రిష్ణగిరి, హోసూరుతో పాటు తమిళనాడులోని వివిద జిల్లాలో నివాసం ఉంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన లక్షలాది మంది తమిళనాడులో వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరి ఓట్లు మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి,

Tamil voters have to vote for whichever party wins in several constituencies in Chittoor district

చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగిరి, జీడీ నెల్లూరు, సత్యవేడు, తిరుపతి నియోజక వర్గాల్లో చాలా మంది తమిళ్ మాట్లాడుతుంటారు. ఈ అసెంబ్లీ నియోజక వర్గాల్లో తమిళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు తమిళనాడులో కలిసిపోయాయి. అక్కడున్న లక్షలాది మంది తమిళులు ఆంధ్రప్రదేశ్ లోనే స్థిరపడిపోయారు. తమిళనాడు వలస వెళ్లినవారు మాత్రమే కాకుండా చిత్తూరు జిల్లాలో లక్షలాది మంది తమిళ ప్రజలు స్థిరపడిపోయారు.

కుప్పం, నగిరి, సత్యవేడు, పలమనేరు, జేడీ నెల్లూరు ప్రాంతంలో లక్షలాది మంది తమిళ ఓటర్లు ఉన్నారు. ఈ నియోజక వర్గాల్లో ఎవరు గెలవాలన్నా తమిళ తంబీలు కనికరించాలి. మంత్రి ఆర్ కే రోజా సొంత నియోజక వర్గం నగిరిలో 55 వేల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. నగిరి, పుత్తూరు మునిసిపాలిటితో పాటు విజయపురంలోనే 55 వేల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. గతంలో రెండు సార్లు రోజా తమిళ ఓటర్ల పుణ్యమా అంటూ ఎమ్మెల్యేగా గెలిచిపోయారు.

నగిరిలో మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నిస్తున్న రోజా తమిళ ఓటర్లను ఆకర్షించడానికి తమిళ్ లోనే ఎక్కవగా మాట్లాడుతున్నారు. ఇక ఆర్ కే రోజా భర్త ఆర్ కే సెల్వమణి తమిళ్ తప్పా మరో బాష మాట్లాడకుండా తమిళ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇటీవల నగిరిలో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం తమిళ్ లో మాట్లాడి తమిళ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించారు.

Tamil voters have to vote for whichever party wins in several constituencies in Chittoor district

సత్యవేడు నియోజక వర్గంలో 65 వేల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. సత్యవేడు, నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం మండలాల్లో 65 వేల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. చిత్తూరులో 75 వేల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. చిత్తూరు రూరల్, గుడిపాల ప్రాంతాల్లో తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలో20 వేల మంది తమి ఓటర్లు ఉన్నారు.

జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజక వర్గంలో 55 వేల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. జేడీ నెల్లూరుతో పాటు ఎస్ఆర్ పురం, కార్వేటినగరం ప్రాంతంలో 55 వేల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. పలమనేరు అసెంబ్లీ నియోజక వర్గంలో కూడా 20 వేల మందికి పైగా తమిళ ఓటర్లు ఉన్నారు. చిత్తూరు, నగిరి, జేడీ నెల్లూరు, కుప్పం, సత్యవేడు, పలమనేరు నియోజక వర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలవాలన్నా తమిళ తంబీలు కచ్చితంగా కనికరించాల్సిందే. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో తమిళ తంబీలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో త్వరలో తెలిసిపోతుంది,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+