తారకరత్నకు నివాళి : చంద్రబాబు - విజయసాయిరెడ్డి అక్కడే .!!
తారకరత్నకు చంద్రబాబు నివాళి. సాయిరెడ్డి- చంద్రబాబు సుదీర్ఘంగా చర్చ.
నందమూరి తారకరత్న కు టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి తారకరత్న నివాసానికి వెళ్లారు. తారకరత్న సతీమణి..కుటుం సభ్యులను ఓదర్చారు. అక్కడే ఉన్న వైసీపీ నేత విజయ సాయిరెడ్డి చివరి నిమిషం వరకు కోలకుంటామని భావించామంటూ చంద్రబాబుతో ఆవేదన వ్యక్తం చేసారు. ఆస్పత్రిలో అందిన చికిత్స గురించి చర్చించారు. తారకరత్న చికిత్స విషయంలో బాలయ్య తీసుకున్న చొరవ ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది.
ఇదే సమయంలో చంద్రబాబు- సాయిరెడ్డి సుదీర్ఘంగా మాట్లాడుకున్నార. ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని తారకరత్న తనతో చెప్పిన అంశాన్ని చంద్రబాబు వెల్లడించారు. బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.
చంద్రబాబు నివాళి - పరామర్శ
బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన తారక రత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి తారకరత్న నివాసానికి చేరుకున్నారు. అక్కడ నివాళి అర్పించారు. తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడే ఉన్న వైసీపీ నేత విజయ సాయిరెడ్డి తో ముచ్చటించారు.
బెంగళూరు ఆస్పత్రిలో జరిగిన చికిత్స.. వైద్యులు చెప్పిన అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స సమయంలో వైద్యులు చెప్పిన అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తారకరత్న సతీమణి అలేఖ్య..కుమార్తెల భవిష్యత్ గురించి చర్చించినట్లు సమాచారం.
చంద్రబాబు - విజయసాయిరెడ్డి చర్చలు
తారకరత్న అస్వస్థతకు గురైన సమయం నుంచి చికిత్స విషయంలో నందమూరి బాలయ్య బాధ్యతగా చొరవ..బాధ్యతగా వ్యవహరించిన తీరును చంద్రబాబుతో సాయిరెడ్డి మరోసారి ప్రస్తావించారు. రాజకీయంగా నిత్యం విమర్శలు చేసుకొనే ఇద్దరు నేతలు ఇలా కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకోవటం చర్చనీయాంశంగా మారింది.
తారకరత్న భౌతిక కాయం హైదరాబాద్ చేరుకున్న వెంటనే సాయిరెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఆ తరువాత నివాళి అర్పించేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్..కల్యాణ్ రాం తోనూ సాయిరెడ్డి మాట్లాడారు. విషాదంలో ఉన్న ఆ ఇద్దరినీ ఓదార్చారు. ఇప్పుడు చంద్రబాబుతో సుదీర్ఘంగా మాట్లాడుతూ కనిపించారు. వారి పక్కనే తారకరత్న కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు - సాయిరెడ్డి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు..
తారకరత్న చిన్న సమయంలోనే దూరమయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. వైద్యులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసారని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని తారకరత్నకు ఆలోచన ఉందని..తనతో అదే విషయం పై మాట్లాడారని చెప్పుకొచ్చారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పాదయాత్ర కోసం వచ్చి గుండెపోటుకు గురయ్యారని.. బెంగుళూరులోని ఉత్తమమైన నారాయణ ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలిత లేకుండా పోయిందని చెప్పారు.
సినిమాల్లోనే కాకుండా.. రాజకీయంగానూ తారకరత్నకు భవిష్యత్ ఉందని..ఇంతలోనే ఇలా జరిగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడే సమయంలోనూ సాయిరెడ్డి పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఇది కొత్త చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications