• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేటి టీడీపీ సమావేశానికి "''స్పెషల్ గెస్ట్" - గుట్టు విప్పుతారా : టార్గెట్ సీఎం జగన్..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ కీలక సమావేశం మరి కాసేపట్లో జరగనుంది. 2024 ఎన్నికలకు టీడీపీ సిద్దం అవుతున్న వేళ..ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రత్యేక గెస్ట్ ను ఆహ్వానించారు. సీఎం జగన్ ను ఓడించటమే లక్ష్యంగా పార్టీ నేతల సమక్షంలోనే కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఎన్నికల వరకు భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించనున్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటనలు..లోకేశ్ పాదయాత్ర పైనా ఈ సమావేశంలో ప్రకటన చేసేందుకు రంగం సిద్దమైంది.

Target CM Jagan: A special guest in TDP meeting, who is he and What is his role

చంద్రబాబు అనుభవం + రాబిన్ శర్మ వ్యూహం
టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు జరగుతోంది. ఈ సమావేశంలో వైసీపీ పైన రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్లాలి .. ఎన్నికల వరకు నిర్వహించాల్సిన ప్రభుత్వ వ్యతిరేక పోరాటం పైన పార్టీ అధినేత చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఇప్పటి వరకు తెర వెనుక ఉండి పార్టీకి వ్యూహాలు -ప్రణాళికలు అందిస్తున్న రాబిన్ శర్మ హాజరవుతున్నారు. 2019 ఎన్నికల ముందు ప్రశాంత్ కిశోర్ తో కలిసి రాబిన్ శర్మ ఐ ప్యాక్ తరపున నాడు వైసీపీ కోసం పని చేసారు. ఇప్పుడు పీకే ఐ ప్యాక్ నుంచి దూరం కావటంతో..నాడు కలిసి ఒక టీంగా పని చేసిన రాబిన్ శర్మ ఇప్పుడు టీడీపీ కోసం.. రిషిసింగ్ వైసీపీ కోసం పని చేస్తున్నారు. పీకేను 2018లో జరిగిన ప్లీనరీలో బహిరంగంగా నాడు జగన్ పార్టీ నేతలకు పరిచయం చేసారు.

Target CM Jagan: A special guest in TDP meeting, who is he and What is his role

గతంలో జగన్ కోసం పని చేసిన అనుభవం
ఇప్పుడు చంద్రబాబు ఈ సమావేశం ద్వారా రాబిన్ శర్మను పార్టీ నేతల ముందుకు తీసుకురానున్నారు. చంద్రబాబు అనుభవంతో రాబిన్ శర్మ ప్రచార వ్యూహాలు తోడైతే వైసీపీ పైన విజయం ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమావేశంలో జనసేన - బీజేపీతో పొత్తు పైన పార్టీలో నెలకొన్న డైలమా పైనా చంద్రబాబు - రాబిన్ శర్మ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పొత్తులు ఎన్నికల సమయం దాకా వేచి చూడాల్సి ఉంటుంది..అప్పటి వరకు సొంతంగానే వైసీపీని ఓడించేందుకు సిద్దం కావాలని పార్టీ నేతలకు రూట్ మ్యాప్ ఖరారు చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వం వివిధ వర్గాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు..వాటి వలన జరుగుతున్న నష్టాలను వివరిస్తూ ఆకర్షణీయమైన పేర్లతో నిరసనలు చేయాలని డిసైడ్ చేయనున్నారు.

Target CM Jagan: A special guest in TDP meeting, who is he and What is his role

పొత్తులపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం
ప్రధానంగా మహిళలు - యువత లక్ష్యంగా కార్యక్రమాలను ప్రకటించనున్నారు. ఇదే సమావేశంలో వైసీపీ మూడు రాజధానుల పేరుతో వేస్తున్న అడుగులు అటు ఉత్తరాంధ్ర..ఇటు రాయలసీమలో ఎటువంటి ప్రభావం ఉండనుందనే దాని పైన రాబిన్ శర్మ క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక, తాజాగా చేసిన సర్వేల్లో క్షేత్ర స్థాయిలో టీడీపీకి ఉన్న ఆదరణ గురించి వివరించనున్నారు. అదే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు .. యువతకు 50 శాతం సీట్ల కేటాయింపు వంటి నిర్ణయాల పైన మరోసారి స్పష్టత ఇవ్వనున్నారు. పొత్తుల గురించి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంలో నేతల్లో ఉన్న గందరగోళానికి ముగింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ - కర్నూలు కేంద్రంగా టీడీపీని ఇరకాటంలోకి నెట్టే విధంగా వైసీపీ అమలు చేస్తున్న వ్యూహాలకు కౌంటర్ కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు.

English summary
TDP stata level meeting to be held today at PArty Central office, strategist Robin Sharma attend the meet and give route map for up coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X