కాక పుట్టిస్తున్న శ్రీకాళహస్తి, దక్షిణ కాశీలో కింగ్ ఎవరు ? రగిలిపోతున్న కాపు ఓట్లు ఎవరికంటే !
దక్షిణకాశీగా పేరొందిన శ్రీకాళహస్తి రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఇక్కడి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ సేవలందించారు. రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఈ నియోజక వర్గంలో ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు. శ్రీకాళహస్తిపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. దీనిలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి మనరోసారి టికెట్ కేటాయించారు.
చంద్రబాబు నాయుడు మరోసారి టీడీపీ టిక్కెట్ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికే టికెట్ కేటాయించారు. శ్రీకాళహస్తి పేరు వినగానే పంచ భూత లింగాల్లో ఒకటైన వాయు లింగం గుర్తొస్తుంది. దక్షిణకాశీగా పేరొందిన శ్రీకాళహస్తిలో దశాభ్దాలుగా రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. ఈ నియోజకవర్గంలో బీసీలు, బలిజ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బలిజ ఓటర్లు ఎక్కువగా ఉన్నా రెడ్డి సామాజిక వర్గానికి టీడీపీ, వైసీపీ టిక్కెట్లు ఇస్తూ ఉండటంతో బలిజ సామాజిక వర్గం నాయకులు మాకు అవకాశం రావడం లేదని రగిలిపోతున్నారు.

ఇంతకాలం బలిజ, బీసీలు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే విజయం అని అన్ని పార్టీల నాయకులకు తెలుసు. అయినప్పటికీ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువగా ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ముందు వరకు శ్రీకాళహస్తిలో టీడీపీ , కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడేవి. శ్రీకాళహస్తి నియోజక వర్గం పరిధిలో రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,659 మంది ఉన్నారు.
గతంలో కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 7 సార్లు, వైసీపీ ఒకసారి, స్వతంత్రులు రెండు సార్లు విజయం సాధించారు. దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ పని చేశారు. అద్దూరు బాలరామిరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ టికెట్‌పై , ఒకసారి ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బియ్యపు మధుసూదన్ రెడ్డికి 1,09,541 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డికి 71,400 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ జగన్ వేవ్ లో మొత్తంగా వైపీపీ 38,141 ఓట్ల భారీ మెజారిటీతో శ్రీకాళహస్తిలో తొలిసారి విజయం సాదించింది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శ్రీకాళహస్తిపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి వైసీపీ మరోసారి టికెట్ కేటాయించారు. శ్రీకాళహస్తిలో ఏకంగా నవరత్నాల గుడిని నిర్మించిన ఎమ్మెల్యే బియ్యపు మదుసూధన్ రెడ్డి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ ఆశీస్సులతో పాటు కేడర్ నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతూ వుండటంతో తన విజయం గ్యారెంటీ అంటూ మదుసూదన్ రెడ్డి ధీమాగా ఉన్నారు.

గతంలో టీడీపీకి శ్రీకాళహస్తి కంచుకోటగా ఉండేది. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి బతికి వున్నంత కాలం తెలుగుదేశానికి నియోజకవర్గంలో ఎదురులేకుండాపోయింది. ఆయన మరణం తర్వాత 2019 ఎన్నికల్లో బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డికే టీడీపీ టికెట్ ఇచ్చిందిజ అయితే సుధీర్ రెడ్డి ఓడిపోయారు. అయినప్పటికీ 2024లో మరోసారి టీడీపీ సుధీర్ రెడ్డికి అవకాశం కల్పించింది.
తన కుటుంబానికి శ్రీకాళహస్తిలో వున్న పట్టు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కారణంగా ఈసారి విజయం సాధిస్తానని సుధీర్ రెడ్డి ధీమాగా వున్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు ఇప్పటికే సుధీర్ రెడ్డికి మద్దతు ప్రకటించడంతో శ్రీకాళహస్తిలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఇప్పటికే శ్రీకాళహస్తికి చెందిన ఆ పార్టీ నాయకులతో మాట్లాడి సుధీర్ రెడ్డిని గెలిపించాలని సూచించారని తెలిసింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications