గాలిలో తిరిగితే గాలే వినపడుతోంది.. జనం ఘోష కాదు...సీఎం జగన్‌పై టీడీపీ అనిత ఫైర్..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. ట్వీట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. భారీ వర్షాలపై ఆమె స్పందించారు. వారి గోష ఆలకించండి మహా ప్రభో అంటూ సీఎం జగన్‌కు హితవు పలికారు. వరద బీభత్సం సృష్టిస్తోన్న పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు.

సీఎం జగన్ ఏరియల్ సర్వే..
గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో వరుణ విలయం కొనసాగుతుండగా.. ఏపీలో కూడా వర్షాల ప్రభావం ఎక్కువగానే ఉంది. అయితే వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. అలా కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని అనిత అంటున్నారు. గాలిలో తిరిగితే గాలే వినపడుతోంది.. ప్రజల గోష కాదు అంటూ ట్వీట్ చేశారు. జనం వద్దకు వచ్చి.. వారితో మాట్లాడాలని కోరారు. సాధన బాధకాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు.

అప్పుడంటే సినిమా చూశారు..
తీత్లీ తుఫాన్ వచ్చిన సమయాన్ని గుర్తుచేశారు. అప్పుడు జగన్ పిల్లలతో కలిసి ఎవెంజర్స్ మూవీ చూశారు. అప్పట్లో ఇదీ హాట్ టాపిక్ అయ్యింది. కానీ ఇప్పుడు సీఎంగా ఉండి బాద్యతారహిత్యంగా ప్రవర్తించడం ఏంటీ అని అడిగారు. అప్పుడంటే థియేటర్లు ఉన్నాయి.. ఇప్పుడు అవీ కూడా లేవుగా అని అనిత గుర్తుచేశారు. మరీ ఎందుకు జనాల గోడు పట్టించుకోవడం లేదని అడిగారు.
ప్రజలంటే లెక్కలేదా..?
ప్రజలు అంటే ఎందుకు లెక్కలేదు అని అనిత నిలదీశా రు. వారికి ఆపన్నహస్తం అందించాల్సింది పోయి కంటితుడుపుగా ఏరియల్ సర్వే చేయడం సరికాదన్నారు. దీంతో బాధితులు మరింత ఆత్మన్యూనత భావానికి గురవుతారని చెప్పారు. వారిలో ధైర్యం నింపాల్సింది ఏలికలే కదా అన్నారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications