నగరితో సహా అయిదు కీలక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధుల ప్రకటన..!!

నగరితో సహా అయిదు నియోజవకవర్గాల్లో టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది.

వచ్చే ఎన్నికలకు టీడీపీ సిద్దం అవుతోంది. ఎలాగైనా అధికారం దక్కించుకోవటం లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అటు జనసేనతో పొత్తు..ఇటు సర్వేలతో అభ్యర్ధుల ఖరారుతో కొత్త రాజకీయ లెక్కలు తెర మీదకు తీసుకొస్తోంది. ఇప్పటికే టీడీపీ సిట్టింగ్ లకు తిరిగి సీట్లు ఖరారు చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. జనసేన తో పొత్తు వరకు ఇతర సీట్లతో అభ్యర్ధుల ప్రకటన ఉండదని భావించారు. కానీ, టీడీపీ నాయకత్వం మాత్రం పొత్తు పైన ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో కీలక నియోజకవర్గాల్లో అభ్యర్దులను ఫైనల్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా టీడీపీ ఈ సారి ఎలాగైనా భావిస్తున్న నగరితో సహా అయిదు నియోజవకవర్గాల్లో టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది.

అటు చంద్రబాబు..ఇటు లోకేష్

అటు చంద్రబాబు..ఇటు లోకేష్

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏ ఒక్క అవకాశం వదులుకోవటానికి సిద్దంగా లేరు. అందులో భాగంగా ఇప్పటికే జనసేనతో పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నేతలు తమకు టీడీపీతో పొత్తు ఉండదని చెబుతున్నా...చంద్రబాబు వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అటు చంద్రబాబు జిల్లాల పర్యటన..ప్రభుత్వంపైన విమర్శలు..పార్టీ పరిస్థితిపైన సమీక్షలు..అభ్యర్ధుల ఖరారు పైన ఫోకస్ చేసారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా పర్యటన ముగింపు వేళ అనపర్తిలో పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేసారు. ఇటు లోకేష్ తన పాదయాత్ర ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తన స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటూ.. పార్టీ నాయకత్వానికి స్థానిక పరిస్థితుల పైన నివేదిక ఇస్తున్నారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ ఆ జిల్లాలో పార్టీ పరిస్థితుల పైన అసంతృప్తి వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది.

అయిదుగురు అభ్యర్దుల ప్రకటన

అయిదుగురు అభ్యర్దుల ప్రకటన

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో ఒకే సారి అయిదుగురు అభ్యర్దులు ఖరారయ్యారు. నియోజవకర్గ ఇంఛార్జ్ లుగా ఉన్న అయిదుగురిని వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్దులుగా ప్రకటించారు. కుప్పం నుంచి చంద్రబాబు బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు ప్రకటించిన అయిదుగురితో జిల్లాలో ఆరుగురు టీడీపీ అభ్యర్దులను ఖరారు చేసారు. అయితే, ఇప్పుడు లోకేష్ వీరి పేర్లను ప్రకటిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అనుమతితోనే ఈ ప్రకటనలు చేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగా..నగరి పైన ఈ సారి టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కుప్పం నుంచి ఈ సారి తిరిగి దివంగత ముద్దుకృష్ణమనాయుడు తనయుడు భానుప్రకాష్ పేరును లోకేష్ ప్రకటించారు. అదే విధంగా.. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, సత్యవేడులో డాక్టర్‌ హెలెన్‌, చంద్రగిరిలో పులవర్తి వెంకట ముని ప్రసాద్‌ (నాని) పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి, దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని ప్రకటించారు. వీరిలో డాక్టర్‌ హెలెన్‌ కొత్తగా రంగంలోకి వచ్చారు. ఆమె విజయానికి పాటుపడాలని.. అభ్యర్థిత్వంపై మరో ఆలోచనే లేదని లోకేష్ పార్టీ నేతలకు తేల్చిచెప్పారు.

చిత్తూరు నేతలపై లోకేష్ అసంతృప్తి..

చిత్తూరు నేతలపై లోకేష్ అసంతృప్తి..

అదే విధంగా ప్రకటించిన అయిుద నియోజకవర్గాల్లో చంద్రగిరి నుంచి పులవర్తి వెంకట ముని ప్రసాద్‌ (నాని) పేరు ప్రకటించారు. నాని చిత్తూరు అసెంబ్లీ సీటు ఆశిస్తూ చంద్రగిరిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇప్పుడు లోకేష్ ఈ సీటు పైన క్లారిటీ ఇచ్చారు. నాని నియోజకవర్గంలో పాదయాత్రతో ఇల్లిల్లూ తిరుగుతారని తేల్చి చెప్పారు. ఇక..జిల్లాలోని గంగాధర నెల్లూరు, పూతలపట్టు రిజర్వుడు నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ అభ్యర్దుల విషయంలో నిర్ణయానికి రాలేదు. చిత్తూరు నాయకుల పనితీరుపై లోకేశ్‌ సంతృప్తిగా లేరు. పైగా అక్కడ తన పాదయాత్ర ముగిశాక ఆ నియోజకవర్గంలో క్లస్టర్‌, యూనిట్‌ కమిటీలను రద్దు చేశారు. తిరుపతి నగరానికి సంబంధించి కూడా అభ్యర్థిత్వంపై లోకేశ్‌ ఏ ప్రకటనా చేయలేదు. లోకేష్ తన యాత్రలో ఇప్పుడు అభ్యర్దుల ప్రకటన.. పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఈ యాత్ర విషయంలో పార్టీ నేతలు మరింత అప్రమత్తం అవుతున్నారు. లోకేష్ ప్రకటనలు ఇప్పుడు పార్టీలో ఆసక్తి కరంగా మరుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+