పవన్ కు టీడీపీ భారీ జలక్ - కీలక నిర్ణయం, వాట్ నెక్స్ట్..!!
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ పవన్ కు భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వాలంటీర్ వ్యవస్థ పైన పవన్ సంచలన ఆరోపణలు చేసారు. అసల వాలంటీర్ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు. దీని పైన న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. వాలంటీర్ వ్యవస్థ వెన్ను విరగ్గొడామంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ సమయంలో వాలంటీర్ వ్యవస్థ పైన టీడీపీ తమ వైఖరి ప్రకటించింది.
వాలంటీర్లపై పవన్ కామెంట్స్ : ఏపీల వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్ల పాత్ర కీలకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.60 లక్షల మంది వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

'పెన్షన్ల పంపకం మొదలు అవసరమైన అత్యవసర సేవల్లోనూ పాల్గొంటున్నారు. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేసారు. వారి పైన ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసారు. ఆ తరువాత అందరినీ కాదంటూ గొంతు సవరించారు. వాలంటీర్ వ్యవస్థ పైన న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసారు.
తమ వైఖరి స్పష్టం చేసిన టీడీపీ : పవన్ చేసిన ఆరోపణల పైన వాలంటీర్లు మండిపడ్డారు. నిరసనలకు దిగారు. వైసీపీ నేతలు సైతం వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. ఈ సమయంలో వాలంటీర్ల వ్యవస్థ పైన టీడీపీ తమ వైఖరి స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రజల కోసం సమర్థవంతంగా, సక్రమంగా పని.చేసేలా వలంటీర్లను తీర్చిదిద్దుతామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు వెల్లడించారు.
వేధిం పులు, పని ఒత్తిడి లేకుండా ప్రజలకు జవాబు దారీగా, బాధ్యతాయుతంగా సేవలందించే నూతన వ్యవస్థగా మారుస్తామని వివరించారు. వలంటీర్, సచివాలయ వ్యవస్థను టీడీపీ రద్దు చేస్తుందనడం అపోహ మాత్రమేనని తేల్చి చెప్పారు. వలంటీర్ వ్యవస్థలోని లోపాలను, కొందరు వాలంటీర్ల హద్దులు మీరిన ప్రవర్తననే తాము తప్పు పడుతున్నామని వివరించారు.

పవన్ ఆలోచనలకు భిన్నంగా టీడీపీ : వాలంటీర్లను తమ స్వార్థానికి వాడుకుంటున్న ప్రభుత్వాన్ని, వైసీపీ నేతల్ని నిలదీస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒక వైపు పవన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వస్తున్నా వాలంటీర్ల విషయంలో తాను వ్యతిరేకమనే స్టాండ్ నే కొనసాగించారు. అసలు పంచాయితీ కార్యాలయాలు ఉండగా సచివాలయాలు ఎందుకని ప్రశ్నించారు.
వాలంటీర్లు ప్రజల డేటా సేకరించటం ఏంటని నిలదీసారు. టీడీపీ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. పెద్ద సంఖ్యలో ఉన్న వాలంటీర్లను ఎన్నికల వేళ దూరం చేసుకోకూడదని నిర్ణయించింది. పవన్ వ్యాఖ్యలతో వెల్లువెత్తిన నిరసనతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పవన్ తో పొత్తు వేళ కీలక అంశంలో టీడీపీ చేసిన ఈ ప్రకటన పైన జనసేన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications