కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సొంత జిల్లాలో జగన్‌కు షాక్: డీసీసీబీ టీడీపీ వశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలో ఎదురు దెబ్బ తగిలింది. కడప డీసీసీబీ చైర్మన్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. డీసీసీబీ చైర్మన్‌గా వీర శివా రెడ్డి తనయుడు అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు.

కో ఆప్షన్ సభ్యులతో కలిపి తెలుగుదేశం పార్టీకి 12 మంది డైరెక్టర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 9 మంది డైరెక్టర్లు ఉన్నారు. దీంతో, డీసీసీబీ చైర్మన్‌గా అనిల్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సీఎం రమేష్ తదితరులు హాజరవుతారు.

TDP Bags Kadapa DCCB Chairman Post; Anilkumar Reddy wins

ఆదివారం ఉదయం ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే ముందుగా కో-ఆప్సన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. దాంతో చైర్మన్‌ అభ్యర్థిగా అనిల్‌ రంగంలోకి దిగారు.

ఇప్పటికే ముగ్గురు డైరక్టర్లు టీడీపీలోకి ఫిరాయించడంతో మెజారిటీ లేక మిగతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు కూడా ఎన్నిక నుంచి వెళ్లిపోయారు. దీంతో కడప డీసీసీబీ ఏకగ్రీవంగా టీడీపీ ఖాతాలో పడింది. కాసేపట్లో డీసీసీబీ ఛైర్మన్‌గా అనిల్ కుమార్‌ రెడ్డిని అధికారికంగా ప్రకటించనున్నారు.

English summary
TDP Bags Kadapa DCCB Chairman Post; Anilkumar Reddy wins
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X