ఎన్టీఆర్ స్టేడియం ఎఫెక్ట్: కేటీఆర్ పేరు మార్చుకున్నాకే (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ భిక్ష పెట్టారని, ఆయన పేరుతో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం ఇష్టం లేకుంటే.. మొదట ఆయన తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేరును మార్చుకోవాలని తెలంగాణ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మించడం సరికాదన్నారు. ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ, తెలంగాణ టీడీపీ నేతలు ఎన్టీఆర్ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్, తెరాస ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు.

కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్‌టీఆర్‌ అని, ఆ కృతజ్ఞత మరిచి కళాభారతి నిర్మాణమంటూ ఆయన పేరిట ఉన్న ఎన్‌టీఆర్‌ స్టేడియాన్ని కుట్రపూరితంగా లేకుండా చేయాలని చూస్తున్నారని టీడీపీ నగరాధ్యక్షులు సీ కృష్ణాయాదవ్‌ ఆరోపించారు.

ఎన్టీఆర్ స్టేడియం

ఎన్టీఆర్ స్టేడియం

యువత క్రీడలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల నిర్వహణకు ఉపయోగపడుతున్న స్టేడియాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే కోర్టుకు వెళ్తామని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

ఎన్టీఆర్ స్టేడియం

ఎన్టీఆర్ స్టేడియం

ఛాతీ ఆస్పత్రిలో సచివాయలయం అని ప్రకటించి రూ.140 కోట్ల నిధులతో సహా ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు ఇప్పుడు కంటోన్మెంట్‌లో సెక్రటేరియేట్‌ కడతామంటుందన్నారు.

ఎన్టీఆర్ స్టేడియం

ఎన్టీఆర్ స్టేడియం

సాగర్‌ చుట్టూ ఆకాశహర్మ్యాలు, జలాశయం ఖాళీ అంటారని, ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ప్రభుత్వ పెద్దలకే అర్థం కావడం లేదన్నారు.

ఎన్టీఆర్ స్టేడియం

ఎన్టీఆర్ స్టేడియం

ఇక వారు ప్రజోపయోగ పాలన ఎలా చేస్తారని నిలదీశారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్నా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సర్కారు పూర్తిగావిఫలమైందని విమర్శించారు.

ఎన్టీఆర్ స్టేడియం

ఎన్టీఆర్ స్టేడియం

పెట్టుబడిదారులు, భూస్వాములు, కార్పొరేట్‌ సంస్థలు, దొరల కోసం తప్ప సామాన్యుల కోసం ఏం చేశారో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ఎన్టీఆర్ స్టేడియం

ఎన్టీఆర్ స్టేడియం

మూడు నెలల్లో రెండు పర్యాయాలు నీటి బిల్లులు పెరిగినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో స్థానిక ప్రజా ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించకపోవడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ స్టేడియం

ఎన్టీఆర్ స్టేడియం

గ్రేటర్‌ ఎన్నికల్లో సర్కారుకు గుణపాఠం చెబుతారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు హెచ్చరించారు.

ఎన్టీఆర్ స్టేడియం

ఎన్టీఆర్ స్టేడియం

ఎన్టీఆర్ స్టేడియంలో విద్యార్థులు, యువత ఆడుకుంటుందని, ఇలాంటి స్థలంలో కళాభారతి నిర్మాణం సరికాదని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు.

ఎన్టీఆర్ స్టేడియం

ఎన్టీఆర్ స్టేడియం

కళాభారతి నిర్మాణం కోసం హైదరాబాదులో మరెన్నో వేదికలు ఉన్నాయని లక్ష్మణ్ అన్నారు. దాదాపు ఎనబై క్రికెట్ టీంలు ఇక్కడ నిత్యం ఆడుకుంటాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+