మోడీతో చంద్రబాబు దోస్తీ: టిడిపికి మైనారిటీలు దూరం
విజయవాడ: బిజెపితో పొత్తు తెలుగుదేశం పార్టీని సీమాంధ్రలో చిక్కుల్లో పడేసేట్లుంది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో కలిసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో సుడిగాలి పర్యటన కూడా చేశారు. ఈ ప్రభావం సీమాంధ్రలోని మైనారిటీ ఓటర్లపై పడుతోంది. మైనారిటీ ఓటర్లు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే అవకాశాలున్నాయి.
మైనారిటీల్లో ముస్లిం ఓటర్లు 12 శాతం ఉండగా, పది శాతం క్రైస్తవ ఓటర్లున్నారు. క్రైస్తవుల సంఖ్య సీమాంధ్రలో దాదాపు 3.5 కోట్లు ఉంటుంది. వారిని అన్ని పార్టీలవాళ్లు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఎటు వైపు మొగ్గుతారనే విషయంపై ఫలితాల ప్రభావం ఆధారపడి ఉండవచ్చు.
బిజెపితో చేతులు కలిపిన నేపథ్యంలో మైనారిటీలను ఒప్పించడం తెలుగుదేశం పార్టీకి కష్టంగానే ఉంది. బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే సీమాంధ్రలో ఎన్నికలు మరో రకంగా ఉండేవని కడప జిల్లా జమైత్ - ఉలామా -ఐ - హిందు అధ్యక్షుడు హమీద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

బిజెపితో పొత్తు టిడిపి పొత్తు పెట్టుకోవడంతో ముస్లింలు చంద్రబాబును కోరుకోవడం లేదని ఆయన అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిలబెట్టిన ముస్లిం అభ్యర్థులకు మైనారిటీలు మద్దతు ఇస్తారని విజయవాడలోని రాజకీయేతర సంస్థ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు హబీబుర్ రహ్మాన్ అన్నారు. ముస్లిం ఓట్లు చీలకుండా లోకసభ స్థానాల్లో వ్యక్తిగత ఇమేజ్‌ను బట్టి వైయస్సార్ కాంగ్రెసు లేదా కాంగ్రెసు ఉమ్మడి అభ్యర్థిని బలపరుస్తారని ఆయన చెప్పారు
వైయస్సార్ కాంగ్రెసు 175 శాసనసభా స్థానాల్లో ఒక్క మైనారిటీ అభ్యర్థినే నిలబెట్టింది. 25 లోకసభ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు ఒక్క మైనారిటీ అభ్యర్థిని కూడా పోటీకి దింపలేదు. లోకసభ స్థానాల్లో టిడిపి, కాంగ్రెసు ఒక్కరేసి అభ్యర్థులను పోటీకి దింపాయి. నంద్యాల నుంచి టిడిపి తరఫున ఎన్ఎండి ఫరూక్ పోటీ చేస్తుండగా, కాంగ్రెసు నుంచి గుంటూరు నుంచి వహీద్ షేక్ పోటీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications