ఏపీలో కల్పిన మండలాలపై సభలో.., జగదీశ్వర్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల ప్రజలకు న్యాయం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులు, ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ముంపు మండలాల ప్రజలకు తెలంగాణలోనే పునరావాసం కల్పించాలన్నారు.
మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం దుర్మార్గమన్నారు. ఏడు మండలాల విలీనం పైన తాము మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. అనంతరం రేషన్ కార్డుల పైన చర్చ జరిగింది. రేషన్ కార్డుల పైన ప్రభుత్వం తీరు నిరసిస్తూ బీజేపీ, టీడీపీ వాకౌట్ చేశాయి.
తెల్ల రేషన్ కార్డుల కోసం 653 జీవో ఎందుకు తెచ్చారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ప్రశ్నించారు. కొత్త బట్టలు, తెల్లబట్టలు వేసుకుంటే రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు. అనంతరం వారు వాకౌట్ చేశారు. దీనిపై ఈటెల మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి సంబంధం లేదని చెప్పారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి మనిషికి ఆరు కిలోల బియ్యం ఇస్తామని చెప్పారు. కొత్త బట్టలు వేసుకుంటే రేషన్ కార్డులు ఇవ్వమా అని ప్రశ్నించారు.

శాసన మండలిలో...
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి శాసన మండలిలో చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా డీ శ్రీనివాస్ ఉద్యోగాల కల్పన పైన లేవెత్తిన ప్రశ్నకు మంత్రి సమాధానిస్తూ.. ఇప్పటికే టీపీఎస్సీని ఏర్పాటు చేసి తీర్మానం చేశామని, అతి త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. విద్యార్థుల పైన కాల్పులు జరిపిన చరిత్ర కాంగ్రెస్‌ది అన్నారు. విద్యార్థుల ఆందోళనను కాంగ్రెస్ పార్టీ ఉసిగొల్పిందన్నారు.
ఈ సమయంలో ఎమ్మెల్సీ నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఓసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రావాలని జగదీశ్వర్ రెడ్డికి సూచించారు. దీనికి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఓయుకు రమ్మంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వెట్టి చాకిరి ఉండవద్దనే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినట్లు చెప్పారు.
ఉద్యోగాల ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉన్నతాధికారుల కొరత కారణంగా ఉద్యోగుల భర్తీ ఆలస్యమైందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం తాము చేయడం లేదన్నారు. నిరుద్యోగ సమస్యను సీఎం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications