నంద్యాల: శిల్పా కోసం భూమా నాగిరెడ్డి ఇలా, కానీ...

కర్నూల్ జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలు రాజకీయాలను రోజుకో మలుపు తిప్పుతున్నాయి.

నంద్యాల: కర్నూల్ జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలు రాజకీయాలను రోజుకో మలుపు తిప్పుతున్నాయి. టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టిడిపిని వీడారు. అయితే తమ మధ్య ఉన్న విబేధాలను విస్మరించి కూడ చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్సీగా విజయం సాధించేందుకు ప్రయత్నం చేశారు భూమా నాగిరెడ్డి కుటుంబసభ్యులు ప్రస్తావిస్తున్నారు. అయితే టిడిపి తన వ్యూహన్ని మార్చుకొంటుంది.

నంద్యాలలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడాన్ని ఆది నుండి శిల్పా సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం అనివార్యమని బాబు శిల్పా సోదరులకు తేల్చి చెప్పారు.

మరోవైపు శిల్పా సోదరులకు , భూమా నాగిరెడ్డికి మధ్య పోసగలేదు. ఈ విషయమై బహిరంగంగానే రెండు వర్గాలు విమర్శలు చేసుుకొన్నారు. ఒకరిపై మరోకరు కేసులు పెట్టుకొన్న పరిస్థితి కూడ నెలకొంది. అయితే అదే సమయంలో రెండు వర్గాల మధ్య సమన్వయం కోసం పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేసింది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రెండు గ్రూపుల మధ్య కొంత సఖ్యతను పెంచాయి,.స్థానిక సంస్థల్లో వైసీపీకి మెజారిటీ ఉన్నా, ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు.

బాబు వద్ద తన మద్దతుదారులతో భూమా నాగిరెడ్డి

బాబు వద్ద తన మద్దతుదారులతో భూమా నాగిరెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను శిల్పా సోదరులతో తనకున్న విబేధాలను కూడ భూమా నాగిరెడ్డి పక్కన పెట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి విజయం కోసం ఆయన కృషి చేశారు. భూమా నాగిరెడ్డి వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు శిల్పా చక్రపాణిరెడ్డికి ఓటు చేస్తారో లేదోననే అనుమానాలు ఆనాడు వ్యక్తమయ్యాయి. అయితే భూమా నాగిరెడ్డి చనిపోవడానికి ముందు రోజు ఏపీ సిఎం చంద్రబాబునాయుడుతో తన అనుచరులతో కలిసి సమావేశమయ్యారు. శిల్పా చక్రపాణిరెడ్డికే ఓటు చేస్తామని బాబు మందు ప్రతినబూని మరీ ఆయన వచ్చారు. బాబుతో సమావేశమై వచ్చిన మరునాడే ఆయన మరణించారని కుటుంబసభ్యులు గుర్తుచేస్తున్నారు.

Recommended Video

    Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
    శిల్పా సోదరులిలా..

    శిల్పా సోదరులిలా..

    నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి సోదరుడు వీర శేఖర్‌రెడ్డి తనయుడు భూమా బ్రహ్మనందరెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఈ స్థానం నుండి భూమా కుటుంబం నుండి పోటీ చేస్తున్న తరుణంలో శిల్పా సోదరులు పార్టీ మారారు. వైసీపీ నుండి శిల్పా మోహన‌రెడ్డి ఈ స్థానం నుండి అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఈ విషయాలను టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు.

    ఎత్తులకు పై ఎత్తులు

    ఎత్తులకు పై ఎత్తులు

    ఈ ఎన్నికల్లో విజయం కోసం రెండు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. అధికార పార్టీ అనుసరించే వ్యూహన్ని దెబ్బకొట్టే దిశగా విపక్ష వైసీపీ ప్లాన్ చేస్తోంది. విపక్షానికి ధీటుగా అధికార పార్టీ కూడ ప్లాన్ చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే భూమా నాగిరెడ్డి ఇచ్చిన ఎన్నికల హమీలను అమలు చేసే దిశగా టిడిపి ప్లాన్ చేసింది. అయితే అవి అమలయ్యే సమయంలోనే షెడ్యూల్ విడుదలైంది.

     సెంటిమెంట్ అస్త్రంగా

    సెంటిమెంట్ అస్త్రంగా

    ఈ ఎన్నికల్లో సెంటిమెంట్‌ను ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రచారం చేయాలని టిడిపి భావిస్తోంది. సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చి వైసీపీ పోటీచేస్తున్న విషయాన్ని టిడిపి ప్రచారం చేయనుంది. అంతేకాదు తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలపై పోటీ చేస్తారా అంటూ టిడిపి ప్రచారం చేయనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+