పవన్ కు మద్దతుగా రంగంలోకి చంద్రబాబు - పక్కా వ్యూహం, టార్గెట్ ఫిక్స్..!!
జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల దుమారం కొనసాగుతున్న వేళ చంద్రబాబు అదే తరహాలో వ్యాఖ్యలు చేసారు.. పవన్ కొద్ది రోజులుగా వాలంటీర్ల వ్యవస్థపైన తీవ్ర ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు అదే తరహాలో విమర్శలు మొదలు పెట్టారు. పవన్ ప్రస్తావించిన మహిళల అదృశ్యం...వాలంటీర్ల వ్యవస్థ పైన చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా సీరియస్ కామెంట్స్ చేసారు.
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైసీపీ పాలన పైన తీవ్ర ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో మహిళలపై 52వేల అఘాయిత్యాలు, దాడులు జరిగాయి. 22వేలమంది మహిళలు అదృశ్యమయ్యారని లెక్కలు చెప్పుకొచ్చారు.

3,500అత్యాచారాలు, 41మందిపై సామూహిక అత్యాచారాలు జరిగాయన్నారు. ఇవి తన సొంత లెక్కలు కాదని...కేంద్రం చెప్పిన లెక్కలని వివరించారు. తాడేపల్లిలో సీఎం ఇంటికి కూతవేటు దూరంలో సామూహిక అత్యాచారం జరిగితే ప్రధాన నిందితుడిని ఏళ్లు గడిచినా ఇంతవరకూ పట్టుకోలేకపోయారని విమర్శించారు. టమాటా రూ.200 అయినా పట్టించుకొనే దిక్కులేదన్నారు.
వాలంటీర్లూ! ప్రజలకు అవసరమైన ప్రభుత్వ పనులు మాత్రమే చేయండి. రాజకీయ చేయొద్దు. సైకో చెప్పిన పనులు చేయవద్దు. పార్టీ పనులు చేస్తే మా ఆడబిడ్డలు మిమ్మల్ని నిలదీస్తారు. - వాలంటీర్లను కోరిన నారా @ncbn గారు#MahaShaktiChaitanyaYatra#AndhraPradesh #BhavishyathukuGuarantee#MahaShakti… pic.twitter.com/47ZKugTItm
— Telugu Desam Party (@JaiTDP) July 14, 2023
వాలంటీర్ల వ్యవస్థే టార్గెట్ గా: ప్రజల వ్యక్తిగత వివరాలతో వలంటీర్లకు ఏం పని అని చంద్రబాబు ప్రశ్నించారు. వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఎవరు ఏ పార్టీ... కుటుంబంలో ఏం తగాదాలున్నాయి... ఎవరు ఎవరితో తిరుగుతున్నారు వంటి వ్యక్తిగత విషయాలు కూడా అడుగుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇవన్నీ వాళ్లకు ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి చెప్పిన పనులన్నీ చేయలేక అధికారులకు గుండెపోట్లు వస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
సెలవులు పెట్టి పారిపోతున్నారని చెప్పారు. ప్రశ్నిస్తే మహిళలను కూడా సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ వడ్డీతో సహా తీరుస్తామని హెచ్చరించారు. ఇన్నాళ్లూ తన మంచితనం చూశారని... ఈసారి తనేమిటో కూడా చూస్తాని చంద్రబాబు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ లోని మహిళలందరికీ చెబుతున్నా. మహాశక్తి సంకల్పం తీసుకోండి. అన్ని సమస్యలకి పరిష్కార మార్గం మహాశక్తి సంకల్పం.
— Telugu Desam Party (@JaiTDP) July 14, 2023
- @ncbn గారు#MahaShaktiChaitanyaYatra#AndhraPradesh #TDPforDevelopment #BhavishyathukuGuarantee#MahaShakti#NCBN pic.twitter.com/8XUUuQtZMl
ఒకే తరహా ఆరోపణలతో: వాలంటీర్లు రాజకీయాలు చేయద్దంటూ చంద్రబాబు సూచించారు. వైసీపీ నేతలు చెప్పినట్లు వినద్దని పేర్కొన్నారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో అంశాలను వివరించారు. టీడీపీతోనే మహిళలకు ప్రాధాన్యత పెరిగిందని వివరించారు. ఇప్పుడు పవన కల్యాణ్ చేసిన వ్యాఖ్యల తరహాలోనే వాలంటీర్ల తీరు పైన చంద్రబాబు ప్రస్తావించిన తీరు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.
పవన్..చంద్రబాబు ఇలా ఒకే సమయంలో వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేయటం వెనుక అసలు కారణం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. పవన్ వ్యాఖ్యల పైన వైసీపీ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇప్పుడు చంద్రబాబు చేసిన కామెంట్స్ పైన వైసీపీ స్పందన చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications