చలించిన చంద్రబాబు- ఉబికి వస్తున్న కన్నీటితో : 40 ఏళ్ల రాజకీయాల్లో తొలి సారిగా..!!

టీడీపీ అధినేత చంద్రబాబు చలించి పోయారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న విషాదంతో షాక్ అయ్యారు. 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని టీడీపీ అధినేత వాపోయారు. కందుకూరు సభలో జరిగిన విషాదంతో ఒక్క సారిగా చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు టీడీపీ నేతలంతా అండగా ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటారని అన్నారు. మరోసారి కందుకూరుకు వస్తానన్నారు.

ఆవేదనలో చంద్రబాబు..

ఆవేదనలో చంద్రబాబు..


కందుకూరులో తన సభ కోసం వచ్చిన వారు తొక్కిసలాటలో మరణించటంతో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభంలోనే సభకు వచ్చిన వారు కాల్వలో పడిన విషయం గుర్తించారు. వెంటనే వారికి సాయం అందించాలని..ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీ వాలంటీర్లు వారిని కందుకూరు ఆస్పత్రికి తరలించారు. తొక్కసలాట లోనే పలువురు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపి..ఆస్పత్రికి బయల్దేరారు. అక్కడ వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. మరణించిన..గాయపడిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

సంతాప సభలా బహిరంగా సభ

సంతాప సభలా బహిరంగా సభ


ఆస్పత్రిలో పరామర్శ తరువాత సభను రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.మృతుల కుటుంబాల్లోని పిల్లలను ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మీద ప్రజల్లో ఆవేశం, బాధ ఉందని.. అందుకే ఎక్కువ మంది ఇందేం ఖర్మ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పారు. కొంత మంది అదుపు తప్పి కింద పడటం.. వాళ్ల మీద మరి కొందరు పడటంతో ఘటన చోటు చేసుకుందని వివరించారు. జరిగిన ఘటనపైన చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. చనిపోయినవారికి సంతాపం ప్రకటిస్తూ కొంత సేపు మౌనం పాటించారు. అమాయకులు చనిపోవడం చాలా బాధిస్తోందన్నారు. వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మరణించిన వారి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ బాధ్యతలు తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు.

40 సంవత్సరాల రాజకీయ జీవితంలో..


తన నలభై సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని చంద్రబాబు వాపోయారు. ' కొంత మంది నిండు ప్రాణాలు త్యాగం చేశారన్నారు. కొన్ని మన చేతుల్లో ఉండని చెప్పుకొచ్చారు. ఎమోషనల్‌గా ఉన్నప్పుడు.. సంఘీభావం తెలియజేయాలని అనుకున్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయని వ్యాఖ్యానించారు. క్షతగాత్రులు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమి చేయాలో అన్నీ చేయాలని నాయకులకు సూచించాని చెప్పారు. జరిగిన ఘటనతొ చంద్రబాబు షాక్ అయ్యారు. ప్రధాని స్పందించారు. ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రచారం కోసమే ఇరుకు సందుల్లో సభ ఏర్పాటు చేసి ఎనిమిది మందిని బలి తీసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+