జస్టిస్ చంద్రు వ్యాఖ్యల వెనుక ?-కారణం బయటపెట్టిన చంద్రబాబు-చలమేశ్వర్ బాటలోనే

తమిళ హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రానికి స్పూర్తి అయిన జస్టిస్ చంద్రు ఏపీలో తన వ్యాఖ్యలతో చిచ్చు రేపారు. ఏపీలో వైసీపీ సర్కార్ ను వెనకేసుకొస్తూ జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయింది. అయితే ఆయన వయసు, గతంలో న్యాయవాదిగా అందించిన సేవల్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంది. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఆ వ్యాఖ్యల చిచ్చు కొనసాగుతోంది. తాజాగా వీటిపై స్పందించిన విపక్ష నేత చంద్రబాబు వాటి వెనుక ఉన్న కారణాన్ని కూడా చెప్పేశారు.

 జస్టిస్ చంద్రు వ్యాఖ్యల చిచ్చు

జస్టిస్ చంద్రు వ్యాఖ్యల చిచ్చు

మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రు జీవిత కథ ఆధారంగా తాజాగా తమిళ హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా విడుదల తర్వాతే చాలా మందికి జస్టిస్ చంద్రు గురించి తెలిసింది. అయితే తాజాగా మానవహక్కుల దినోత్సవం సందర్భంగా విజయవాడకు వచ్చిన జస్టిస్ చంద్రు... వైసీపీ సర్కార్ ను వెనకేసుకొస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హైకోర్టు న్యాయమూర్తులు,వారు ఇస్తున్న తీర్పుల్ని తప్పుబట్టేలా జస్టిస్ చంద్రు పలు వ్యాఖ్యలు చేశారు ఇవి కాస్తా సంచలనంగా మారాయి.

 మండిపడ్డ హైకోర్టు

మండిపడ్డ హైకోర్టు

ఏపీలో నెలకొన్న పరిస్ధితులపై జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు హైకోర్టుకు మంటపుట్టించాయి. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు సీజే ప్రశాంత్ మిశ్రా, మరో న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు అంత సరదాగా ఉంటే విశాఖ వెళ్లి డైరెక్టర్ తో అక్కడి మానవహక్కుల ఉల్లంఘనను సినిమా తీయించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తులు సూచించారు. మానవహక్కుల పరిరక్షణ కోసం వచ్చిన వారు తన పని చూసుకోకుండా హైకోర్టును గంపగుత్తగా విమర్శించడం ఏంటని కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ప్రశ్నించింది.

 చంద్రు వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్షన్

చంద్రు వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్షన్


జస్టిస్ చంద్రు విజయవాడ వచ్చిన సందర్భంగా హైకోర్టుపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ స్పందించారు. చంద్రు వ్యాఖ్యలపై ఫైర్ అయిన చంద్రబాబు.. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాల్ని సైతం బయటపెట్టారు. పొరుగు రాష్ట్రానికి చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తికి ఇక్కడకొచ్చి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. అదీ ఏపీలో ప్రభుత్వాన్ని మొచ్చుకుంటూ, హైకోర్టుపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన తెలిపారు.

పదవుల కోసమే చంద్రు వ్యాఖ్యలు

పదవుల కోసమే చంద్రు వ్యాఖ్యలు

జస్టిస్ చంద్రు వైసీపీ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ హైకోర్టుపై చేసిన వ్యాఖ్యల వెనుక పదవుల కారణమే ఉందని చంద్రబాబు వెల్లడించారు. జగన్ సర్కార్ లో పదవులు ఆశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. రిటైర్ అయిన తర్వాత వీళ్లకు పదవులు కావాలి. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్టి చలమేశ్వర్ . ఆయన కుమారుడికి పదవి తీసుకుని జగన్ ను పొగుడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ఇప్పుడు జస్టిస్ చంద్రు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. దీంతో ఇప్పుడు చంద్రు వ్యాఖ్యల వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+