ఏపీ నుంచి కేంద్ర మంత్రులు ఖరారు - శాఖలపై కసరత్తు..!!

కేంద్రంలో..ఏపీలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. రెండు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువు తీరనున్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వంలో టీడీపీతో పాటుగా జనసేన చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలోనూ చంద్రబాబు కేబినెట్ లో జనసేన, బీజేపీ భాగస్వామ్యం కానున్నాయి. ఇక..కేంద్ర కేబినెట్ లో ఈసారి ఏపీకి ప్రాధాన్యత దక్కనుంది. ఏపీ నుంచి కేంద్ర మంత్రుల ఎంపిక పైన చంద్రబాబు కసరత్తు పూర్తి చేసారు. బీజేపీ, జనసేనకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.

కేంద్ర మంత్రులుగా
కేంద్ర ప్రభుత్వం లో ఈసారి టీడీపీ కీలక పాత్ర పోషించనుంది. దీంతో ఆ పార్టీకి భారీగా కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంపీల్లో కొత్త వారు ఎక్కువగా ఉండడంతో ఎవరికి కేంద్రమంత్రి పదవి వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. వరుసగా 3సార్లు గెలిచిన రామ్మోహన్‌ నాయుడుకి పక్కాగా కేంద్ర మంత్రి పదవి ఖాయమైంది. మూడు రీజియన్ల నుంచి టీడీపీ ఎంపీలు ముగ్గురికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. సామాజిక లెక్కల ఆధారంగా ఈ ఎంపిక జరుగుతోంది. అందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా దక్కనుంది.

TDP Expects Three cabient berths in Modi3 0 Govt hope on key port folios

చంద్రబాబు కసరత్తు
ఇక, గోదావరి జిల్లాల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం కేబినెట్ హోదా లో మంత్రి కావటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీకి మూడు స్థానాలు ఇవ్వాల్సి ఉండటం..జనసేన కు అవకాశం ఉండటంతో..బీజేపీకి రెండో మంత్రి పదవి ఉండే అవకాశం లేదని లెక్కలు వేస్తున్నారు. దీంతో..టీడీపీ నుంచి గుంటూరు ఎంపీ పెమ్మసానికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. జనసేన నుంచి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే బాలశౌరి పేరు పరిశీలనలోకి తీసుకొనే ఛాన్స్ ఉంది. అయితే, గుంటూరు కు ప్రాధాన్యత ఇస్తే...ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు అవకాశం ఉంటుందా లేదా అనేది చర్చగా మారుతోంది.

ఛాన్స్ దక్కేదెవరికి
ఇక, రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ దక్కనుంది. సీనియర్ ఎంపీగా ఉన్న హిందూపురం నుంచి గెలిచిన పార్ధసారధి పేరు పరిశీలనలో ఉంది. ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు ఖాయం కావటంతో..సీమ నుంచి ఎస్సీ వర్గానికి అవకాశం ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే చిత్తూరు నుంచి గెలిచిన ప్రసాదరావుకు అవకాశం దక్కనుంది.నాలుగో మంత్రి పదవికి అవకాశం ఉంటే నెల్లూరు నుంచి గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇవ్వనన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఉన్న చంద్రబాబు..బీజేపీ అధినాయకత్వం చర్చల సమయంలో ఈ మంత్రివర్గ స్థానాలు - శాఖల పైక కసరత్తు..నిర్ణయం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+