Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అలా చేస్తే.. టీడీపీ - జనసేన గెలుపు ఖాయం: సుమన్

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రముఖ సినీనటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తనకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గురువు అని తెలిపారు. తిరుపతి తాతయ్యగుంటలోని గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడారు.

సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే తెలుగుదేశం-జనసేన గెలుపు ఖాయమని సుమన్ వ్యాఖ్యానించారు. పరిపాలన బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు ఓటర్లు ప్రలోభాలకు గురికావద్దని సుమన్ సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.

 TDP-Janasena alliance will win in AP elections: Suman.

తనకు ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలేదని సుమన్ తెలిపారు. తమిళనాడు విజయ్ పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాజకీయంగా ఆలోచనతో కూడిన అడుగులు వేస్తున్నారు. అయోధ్య రామప్రతిష్ఠ చరిత్రాత్మకమని సుమన్ అన్నారు. శ్రీరాముని దర్శన భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతమని సుమన్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇది ఇలావుండగా, ఏపీ రాజకీయాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డారని.. ఇప్పుడు జగన్ కూడా భయపడ్డారని అన్నారు. కేసుల భయంతోనే వాళ్లు వెనుకంజ వేశారని విమర్శించారు.

రాక్షసుడ్ని, దుర్మార్గుడ్ని అయినా భరించవచ్చు కానీ, పిరికివాడ్ని భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఎన్నికల సమయంలో నోటాకు ఓట్లు పడకపోవడానికి కారణాలు ఉన్నాయి. ప్రజలు ఎవరు తక్కువ అవినీతిపరుడో చూసుకుని వారికి ఓటేస్తున్నారు తప్ప.. నోటా జోలికి వెళ్లడంలేదని చెప్పుకొచ్చారు.

మార్కెట్లో టమాటాలన్నీ పుచ్చులే ఉన్నప్పుడు వాటిలో కాస్త తక్కువ పుచ్చులున్న వాటినే ఏరుకుంటాం... ఇదీ అంతేనని అన్నారు. ఎన్నికలు మానేయమంటే ప్రజలు మానేస్తారా? టమాటాల విషయంలోనే కాదు, ఇది అన్నింటికీ వర్తిస్తుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఇతను కేంద్రాన్ని అడగడానికి భయమండీ అంటుంటే ఇంకేమనాలి?.. చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఐదేళ్లూ అడగడానికి భయపడ్డాడని.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అడగడానికి భయపడుతున్నాడని అంటున్నారన్నారు.

'జైలుకెళితే ఓడిపోతాననడం అర్థరహితం. జైలుకు వెళ్లిన ప్రతివాడు గెలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడు... రాగానే గెలిచాడు. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాడు.. గెలిచాడు. ఇవాళ చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు. అందరూ అదే అంటున్నారు... చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు, గెలుస్తాడు అంటున్నారు' అని ఉండవల్లి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+