టీడీపీ అంతర్గత సర్వే: వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసిన బొండా ఉమా
YS Jagan oath taking ceremony: ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం అందరి దృష్టీ ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీపై నిలిచింది. ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డీ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. 151కి పైగా అసెంబ్లీ, 22 లోక్‌సభ నియోజకవర్గాల్లో జెండా ఎగురవేస్తామంటూ ఐప్యాక్ టీమ్ సమావేశంలో స్వయంగా వెల్లడించారు కూడా. అటు మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఇదే ధీమా వ్యక్తమౌతోంది.

ఈ క్రమంలో వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకార తేదీని సైతం ఖరారు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. సాగరనగరం విశాఖపట్నంలో జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ గానీ, మంత్రి బొత్స గానీ తాము గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోన్నారని, ఓడిపోతే ఏం చేస్తారో కూడా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఓడిపోతే వైఎస్ఆర్సీపీని మూసివేస్తామంటూ ప్రకటించాలని సవాల్ విసిరారు.
ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పట్టుమని పది సీట్లు కూడా రావని, సింగిల్ డిజిట్‌కే పరిమితమౌతుందని బోండా ఉమా జోస్యం చెప్పారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు కూడా ఓటర్లు క్యూలో నిల్చుని ఓటు వేశారంటే అది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనేనని అంచనా వేశారు. తమ అంతర్గత సర్వే, మీడియా సర్వే ప్రకారం వైసీపీ 10 సీట్లు కూడా రావని పేర్కొన్నారు.

ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకూ వైసీపీ వ్యతిరేకత ఉందని, అందుకే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వేవ్ ఏర్పడిందని బోండా అన్నారు. వైఎస్ జగన్ సహా వైసీపీ నాయకులు చెప్పేవన్నీ కంటితుడుపు మాటలేనని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీకి కనీసం బూత్ ఏజెంట్లు కూడా లేరని చెప్పారు.
తమకు ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల మీద నమ్మకం ఉందని, ఈవీఎంలను భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఈసీకే ఉందని బోండా చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలను అమర్చారని పేర్కొన్నారు. ఈవీఎంలపై ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో నిఘా ఉంచారని తాము భావిస్తున్నామని అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications