Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: భవానీ దీక్షలో కావలి గ్రీష్మ..!!

విజయవాడ: రాష్ట్రంలో దేవీ శరన్నవరాత్రుల కోసం ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ఆరంభం కాబోతోన్నాయి. అదే రోజు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్వహించనున్నారు. ఆ మరుసటి రోజు సాయంత్రం ధ్వజారోహ‌ణ చేస్తారు.

దసరా వేడుకల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం సన్నద్ధమౌతోంది. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలకు హాజరు కావాలంటూ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గ గుడి కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీ ఛాంబర్‌లో వైఎస్ జగన్‌ను కలిశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా ఆహ్వానించారు. అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.

TDP leader Kavali Greeshma taking up Bhavani Deeksha in Kanakadurga temple at Vijayawada

దసరా వేడుకలతో పాటు భవానీ దీక్ష కూడా ఆరంభమౌతుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు భవానీ దీక్షాధారణ చేస్తారు. దీక్షలో ఉన్నన్ని రోజులు కఠిన నియమాలను అనుసరిస్తారు. ఎరుపురంగు చీరను మాత్రమే ధరిస్తారు. అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తూ.. అమ్మవారికి నిత్యం నిత్య పూజాకైంకర్యాలను సమర్పించాల్సి ఉంటుంది. కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జ్యోతులు వెలిగించే భవానీ దీక్షకాలం మండలం లేదా అర్ధ మండలకాలం ఉంటుంది.

TDP leader Kavali Greeshma taking up Bhavani Deeksha in Kanakadurga temple at Vijayawada

ఈ సంవత్సరం కూడా సుమారు ఆరు నుంచి ఏడు లక్షలమంది భవానీలు దీక్షలు స్వీకరిస్తారనే అంచనాలు ఉన్నాయి. డిసెంబరు రెండో వారంలో దీక్ష విరమణ ఉంటుంది. కాగా- తెలుగుదేశం పార్టీ నాయకురాలు కావలి గ్రీష్మ ఇవ్వాళ భవానీ దీక్ష స్వీకరించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో దీక్షను స్వీకరించారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు దీక్షను స్వీకరిస్తోన్న వీడియోను పోస్ట్ చేశారు.

ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు, ఆయురారోగ్యాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీక్షను స్వీకరించిన అనంతరం ఆమె దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొంటోన్నారు కావలి గ్రీష్మ. అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు ఆమె తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో పాల్గొనాలని, అమరావతి రైతులకు సంఘీభావంగా ప్రకటించాలని అప్పట్లో ఆమె పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+