"జగన్ ట్రాప్ లో టీడీపీ- బోండా కామెంట్స్ తప్పు"- జ్యోతుల నెహ్రూ షాకింగ్..!

ఏపీలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చనిపోయినా ఆయన కొనసాగించిన కాపు ఉద్యమం, రాజకీయాలు మరోసారి రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్దానికి పరోక్షంగా కారణమవుతున్నాయి. ముఖ్యంగా కాపునాడు నేతలు నిర్వహిస్తున్న ముద్రగడ సంతాప సభల్లో టీడీపీ, వైసీపీలోని అదే సామాజిక వర్గ నేతలు హాజరవుతుండటం చంద్రబాబుకు మంటపుట్టిస్తోంది. దీంతో ఆయన తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబును కలిసిన తమ ఎమ్మెల్యే బోండా ఉమపై ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించారు. అయినా బోండా ఉమ కూడా ఎక్కడా తగ్గకుండా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బోండా ఉమ కామెంట్స్ తో పాటు తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై టీడీపీలో మరో కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ (jyothula nehru)స్పందించారు. ముద్రగడ సంతాప సభకు వెళ్లిన వ్యవహారంలో బోండా ఉమ తనను తప్పుబట్టడంపై స్పందించిన నెహ్రూ.. తాను ఎవరినో బ్లాక్‌మెయిల్ చేసేందుకు అక్కడికి వెళ్లలేదన్నారు.తద్వారా బోండా ఉమ మాత్రం ముద్రగడ సభకు వెళ్లి ఎవరినో బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఆర్ధం వచ్చేలా కౌంటర్ ఇచ్చారు.

TDP Leaders Are Falling Into YS Jagan s Trap Jyothula Nehru Rejects Bonda Uma s Kapu argument

మరోవైపు జగన్ ట్రాప్‌లో తమ పార్టీ నేతలు పడుతున్నారని జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడానికి కాపు ఉద్యమం కారణమని బోండా ఉమ చెప్పడం సరికాదని ఆయన తెలిపారు. మెజారిటీ కాపులు మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలే వస్తాయని గుర్తుచేశారు. కాపుల అభివృద్ధికి నిర్ణయం తీసుకునేది చంద్రబాబు, కూటమి ప్రభుత్వం మాత్రమేనని జ్యోతుల నెహ్రూ తేల్చిచెప్పేశారు. ఈ వ్యాఖ్యలపై బోండా ఉమ ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+