బిజెపి ఎంపి జీవీఎల్ కు సీఎం రమేష్ ఛాలెంజ్...మండిపడ్డ డొక్కా
అమరావతి:ఎపి ప్రభుత్వం పిడి అకౌంట్ల కుంభకోణానికి పాల్పడినట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చేసిన ఆరోపణల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజాగా జివిఎల్ ఆరోపణలపై ఇద్దరు టిడిపి నేతలు ఘాటుగా స్పందించారు.
పీడీ అకౌంట్స్‌పై జీవీఎల్ బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఎంపి సిఎం రమేష్ సవాలు విసిరారు. పిడి అకౌంట్లపై సిబిఐ విచారణ జరిపించాలని బిజెపి నేతలు ఎపి ప్రభుత్వాన్ని కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు ఏపీ ప్రభుత్వంపై ఎంపి జీవీఎల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ దుయ్యబట్టారు.

ఎంపి జివిఎల్ ఆరోపణల విషయమై న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన టిడిపి ఎంపి సిఎం రమేష్ పీడీ అకౌంట్స్‌పై జీవీఎల్ బహిరంగ చర్చకు సిద్ధమా?...అని ఛాలెంజ్ చేశారు. ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేక సీఎం చంద్రబాబుపై జీవీఎల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పీడీ అకౌంట్స్‌లో అవినీతి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా జీవీఎల్ సిద్ధమా? అని సిఎం రమేష్ ప్రశ్నించారు.
అయినా పిడి అకౌంట్లపై సిబిఐతో విచారణ చేయించాలనుకుంటే టీడీపీ అనుమతి కావాలా?...వారే అధికారం లోవున్నారు కదా అని ఆయన ప్రశ్నించారు. తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామని, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అధికారంలోకి రానివ్వమని సిఎం రమేష్ స్పష్టం చేశారు.
మరోవైపు ఎంపి జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై జీవీఎల్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ప్రతీ రాష్ట్రానికి పీడీ అకౌంట్స్ ఉంటాయని డొక్కా చెప్పారు. కానీ జీవీఎల్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అభివర్ణించారు.
పీడీ అకౌంట్స్‌పై కాగ్ ఎపికే కాక అన్ని రాష్ట్రాలకు తన అభిప్రాయాన్ని చెప్పిందన్నారు. అవసరమైతే పీడీ అకౌంట్స్‌పై కేంద్ర ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని డొక్కా చెప్పారు. ఎలాంటి విచారణకు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఏపీలో బీజేపీకి నూకలు లేవని...అందుకోసమే జివిఎల్ ప్రతిపక్షానికి అనుకూలంగా పనిచేస్తున్నారని డొక్కా ఆరోపించారు.
కేరళలో విపత్కర పరిస్థితులు ఏర్పడితే కేంద్రం దానిపై కూడా దుష్ప్రచారం చేస్తోందని డొక్కా దుయ్యబట్టారు. ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నాయర్ మరణంపై తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని...ఎమర్జెన్సీ సమయంలో నాయర్ తన ఆర్టికల్స్‌తో దేశానికి ఎన్నో మంచి విషయాలు తెలియజేశారని డొక్కా గుర్తుచేశారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications