మోడీ మంత్రివర్గం: బిజెపి, టిడిపి నుంచి బెర్త్‌లు వీరికే?
హైదరాబాద్: నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డియె ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరే అవకాశం ఉంది. సీమాంధ్ర నుంచి బిజెపికి అనూహ్యమైన మద్దతు లభించడంతో తెలుగుదేశం పార్టీకి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే ఉద్దేశంతో మోడీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేయడానికి కంభంపాటి హరిబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ విజయమ్మను ఓడించిన ఘనతను ఆయన సాధించారు. దీంతో ఆయనకు తగిన ప్రాధాన్యం లభించవచ్చు.
జెయింట్ కిల్లర్ కె. రామ్మోహన్ నాయుడుకు మోడీ మంత్రివర్గంలో చోటు లభించవచ్చునని అంటున్నారు. ఆయన తండ్రి ఎర్రంనాయుడికి ఢిల్లీలో మంచి సంబంధాలు ఉండేవి. ఆయన కుమారుడిగా రామ్మోహన్ నాయుడికి మంత్రివర్గంలో 26 ఏళ్ల ఆ యువకుడికి చోటు దక్కవచ్చునని అంటున్నారు. పైగా, శ్రీకాకుళం స్థానంలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిని ఆయన చిత్తు చేశారు. ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు.

రాజమండ్రి నుంచి విజయం సాధించిన సినీ నటుడు మాగంటి మురళీ మోహన్‌కు కూడా అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. రాజకీయ అనుభవం కలిగిన జెసి దివాకర్ రెడ్డికి కూడా అవకాశం లేకపోలేదని అంటున్నారు.
నర్సాపురం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన గోకరాజు గంగరాజుకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చుని అంటున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత. చిత్తూరు పార్లమెంటు సభ్యుడు ఎన్. శివప్రసాద్‌కు కూడా మోడీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో గల్లా జయదేవ్‌ను గానీ, రాయపాటి సాంబశివ రావును గానీ కొట్టిపారేయడానికి లేదు. అయితే, రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి, సిఎం రమేష్ పేర్లు కూడా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. చాలా కాలంగా వారిద్దరు బిజెపి ఢిల్లీ నేతలతో కలిసి పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications