టిడిపిపై మహకుట్ర: పవన్ ఆధారాలుంటే బయటపెట్టు, శ్రీరెడ్డి వెనుక వీరే: బొండా

అమరావతి:తెలుగుదేశం పార్టీలో మహకుట్ర జరుగుతోందని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు చెప్పారు. బిజెపి, జనసేన, వైసీపీ రహస్య ఎజెండా ఏమిటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబుతో సహా రాష్ట్రంలో దీక్షలు చేస్తోంటే ఆ దీక్షలను భగ్నం చేసేందుకు తెలంగాణలో కూర్చొని పవన్ కళ్యాణ్ దీక్షను భగ్నం చేసే కుట్రకు పూనుకొన్నారన్నారు.

Recommended Video

    కాస్టింగ్ కౌచ్‌పై పవన్ కళ్యాణ్ ప్రకటన...

    టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు సోమవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో పాటు వైసీపీ, బిజెపిలపై విమర్శలు గుప్పించారు.

    ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఏప్రిల్ 30వ తేదిన ఏపీకి నరేంద్ర మోడీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను మరోసారి గుర్తు చేయనున్నట్టు చెప్పారు.

    బాబు దీక్షను భగ్నం చేసే కుట్ర

    బాబు దీక్షను భగ్నం చేసే కుట్ర

    ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఏప్రిల్ 20వ తేదిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహ ఏపీ రాష్ట్రంలో ధర్మపోరాట దీక్షలు చేస్తోంటే, ధీక్షలను భగ్నం చేసేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కుట్ర పన్నారని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు ఆరోపించారు. నిరాధార ఆరోపణలను పవన్ కళ్యాణ్ చేశారని చెప్పారు. శ్రీరెడ్డి వెనుక వైసీపీ, రామ్‌గోపాల్ వర్మ ఉన్నారని ఆయన చెప్పారు. రామ్ గోపాల్ వర్మ కూడ తాను ఉన్న విషయాన్ని ఒప్పుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శ్రీరెడ్డి వెనుక కత్తి మహేష్ కూడ ఉన్నారని చెప్పారు. కత్తి మహేష్ వైసీపీ ఢిల్లీలో దీక్షకు వెళ్ళిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

     టిడిపిని దెబ్బతీసేందుకు మహాకుట్ర

    టిడిపిని దెబ్బతీసేందుకు మహాకుట్ర

    ఏపీ రాష్ట్రంలో టిడిపిని దెబ్బతీసేందుకు మహకుట్ర జరుగుతోందని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు ఆరోపించారు. ఆధారాలు లేకుండానే టిడిపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఏపీ మంత్రి నారా లోకేష్‌పై ఆధారాలు లేకుండా విమర్శలు గుప్పించారని చెప్పారు. జనసేన ఆవిర్భావ సభలో కూడ లోకేష్‌పై ఇదే రకంగా తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన గుర్తు చేశారు. జనసేన, వైసీపీ, బిజెపి మధ్య రహస్య ఒప్పందం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

    మోడీపై పోరాటం

    మోడీపై పోరాటం

    మోడీపై నేరుగా పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమేనని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు చెప్పారు. దేశంలో నేరుగా మోడీతో ఢీ కొడుతున్న సీఎం చంద్రబాబునాయుడేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మోడీకి తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. తమపై కేసులు లేవన్నారు. ఏప్రిల్ 30వ తేదిన తిరుపతి సభలో 2014 ఎన్నికల సభలో మోడీ ఇచ్చిన హమీలను మరోసారి గుర్తు చేయనున్నట్టు చెప్పారు.

    ట్వీట్లతో రాజకీయాలు చేయలేరు

    ట్వీట్లతో రాజకీయాలు చేయలేరు

    ట్వీట్లతో రాజకీయాలు చేయలేరని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు చెప్పారు. నేతలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు. ఆరోపణలు చేసే ముందు అన్ని విషయాలను ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. ఏపీ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన బిజెపి వైసీపీ, జనసేనతో కలిసి కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+