ఆ ఊసరవెల్లుల్ని తీసుకోవద్దు-వైసీపీ జంప్ జిలానీలపై టీడీపీ ఎమ్మెల్యే..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక విపక్ష వైసీపీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే ఇద్దరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఓ ఎమ్మెల్సీ కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వీరంతా టీడీపీలో లేదా కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కూటమి పార్టీల నుంచి హామీ లభించాకే వీరు వైసీపీకి రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి రాకపై టీడీపీలో అప్పుడే అసంతృప్తులు మొదలయ్యాయి.
ఇవాళ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. దయచేసి ఇలాంటి ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలో తీసుకోవద్దని ఆమె పార్టీ పెద్దల్ని కోరారు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్ళకి పార్టీలో తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్ళని అవమానించినట్టే అంటూ ఓ ట్వీట్ పెట్టారు.

టిడిపి పార్టీ పెద్దలకు మనవి.దయచేసి ఇలాంటి ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలో తీసుకోవద్దు, అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్ళకి పార్టీలో తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్ళని అవమానించినట్టే. pic.twitter.com/K1dD9bWacP
— Gouthu Sireesha (@gouthusireesha) August 28, 2024
గతంలో టీడీపీలో ఎమ్మెల్సీ పదవి అనుభవించి వైసీపీలోకి ఫిరాయించిన పోతుల సునీత.. తిరిగి ఇప్పుడు టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె రాకపై టీడీపీలో నేతలు భగ్గుమంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ వైసీపీకి పోతుల సునీత రాజీనామా సమర్పించారు. ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుని టీడీపీలో ఆమె చేరతారా లేక అలాగే వచ్చేస్తారా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications