కడపలో కనపడకూడదు, ఆ పేరు వినపడకూడదు, ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాస్ వార్నింగ్
కడపలో మేమే ఎమ్మెల్యేలు, మేమే మంత్రులు, మేమే రాజులు అనుకుని ప్రైవేటు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలని ఎవరైనా అనుకుంటే వారి అంతు చూస్తామని, కడపకు చెడ్డపేరు తీసుకు వచ్చే వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని, మూడు నెలల్లలో కడప సిటీలో గంజాయి అనే మాట వినపడకుండా చేస్తామని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు
టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మీడియాతో మాట్లాడారు. కడప నగరానికి మచ్చ తెచ్చే ఏ వ్యక్తి ఎవరైనా సరే వదిలే ప్రసక్తేలేదని, రౌడీషీటర్లు, పోలీసులు, అధికారులు అందరూ పద్దతి మార్చుకుంటే వారికే మంచిదని కడప ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు మాధవి రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అధికారులు పూర్తిగా సహకరించాలని టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి అధికారులకు సూచించారు.

కడపలో విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తున్నారని, ఆ గంజాయి విక్రయిస్తున్నదని ఎవరు, యువతను నాశనం చేస్తున్నది ఎవరు అనే విషయం పోలీసులకు తెలుసని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ప్రజల సహకారంతో మూడు నెలల్లో కడపలో గంజాయి పేరు వినపడకుండా, ఆ గంజాయి కంటికి కనపడకుండా చేస్తామని, ఒక సీఐతో పాటు ఎస్ఐతో కలపి కొంత మంది పోలీసులతో కలిపి ఓ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి గంజాయి అమ్ముతున్న వారి అంతు చూస్తామని టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి అన్నారు.
కడపలో ప్రైవేట్, ప్రభుత్వభూములు కబ్జాలు చేశారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆరోపంచారు, జీవితాంతం మేమే మంత్రులుగా ఉంటామని కలలు కన్న కొందరు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన ప్రాంతానికి మినిస్టర్ కాలనీ అనే పేరు పెట్టుకుని అక్కడ భవనాలు నిర్మించుకుంటున్నారని, ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీని కలిసి ఆయనకు వాస్తవ పరిస్థితులు చెప్పామని టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి, శ్రీనివాస రెడ్డి మీడియాకు చెప్పారు.
కొందరు నాయకులు ప్రభుత్వ భూములతో పాటు దోబి ఘాట్ లు, శ్మశానవాటికలను కూడా కబ్జా చేశారని, వారికి త్వరలోనే సినిమా చూపిస్తామని శ్రీనివాస రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు. కడపలో రౌడీలు పద్దతి మార్చుకోకుంటే రానున్న రోజుల్లో వారు చేదు సంఘటనలను ఎదురు చూడాల్సి వస్తుందని, ఇప్పుడు మిమ్మల్ని కాపడటానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు ఎవ్వరూ లేరని, ఆ విషయం గుర్తు పెట్టుకుని పద్దతి మార్చుకుంటే మీకే మంచిది అని టీడీపీ ఎమ్మెల్యే మూధవి రెడ్డి, శ్రీనివాస రెడ్డి ఇంతకాలం వైసీపీ నాయకులు చెప్పినట్లు చేసిన కడప రౌడీలను హచ్చరించారు.












Click it and Unblock the Notifications