తిరుమలతో పెట్టుకుంటే ఏమైనారో చరిత్ర చెబుతోంది, దొంగల బ్యాచ్, రఘురామ కృష్ణరాజు

తిరుమల శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బ తీసినందుకు వైసీపీ అధినేత జగన్ ను ఆ వెంకటేశ్వర స్వామి ఓడించారని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అన్నారు. ఉండిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నాయకులు శ్రీవారి భక్తులను స్టువర్టుపురం దొంగల్లా దోచుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన భక్తులను ఎలా దూరం చేయాలనే క్రిమినల్ ఆలోచనలతో గత టీటీడీ బోర్డు పని చేసిందని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బ తియ్యడానికి వైసీపీ నాయకులు తిరుమల లడ్డుల తయారీ విషయంలో ఇంత దారుణాలకు తెగించారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. లడ్డూల తయారీ కోసం ఉపయోగించిన పదార్థాలలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని, ఇది కావాలని టీడీపీ నాయకులు కాని, సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కాదని రఘురామ కృష్ణరాజు అన్నారు.

TDP MLA Raghurama Krishnaraju made sensational comments regarding Tirumala laddoos

శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు తప్పని పరిస్థితుల్లో ఈ విషయం బయట పెట్టాల్సి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అన్నారు. తిరుమలలో భక్తులకు ఉచితంగా మంచినీరు సీసాలు అందించాలని, తిరుమలలో భక్తులు బస చేసే గదుల ధరలు తగ్గించాలని రఘురామ కృష్ణరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన మనవి చేశారు.

తిరుమల కొండపైన భక్తులకి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తాను సీఎం చంద్రబాబు నాయుడుకు, దేవాదాయ శాఖ మంత్రికి తాను మనవి చేస్తానని, టీటీడీ బోర్డు ఏర్పాటు కాకముందే తాను తిరుమలకు వెళితే టీటీడీ ఈవో శ్యామల రావును కలిసి మనవి చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడినట్ల చరిత్రలోనే లేదని, గత వైసీపీ ప్రభుత్వంలోని అరాచకాలను చూసి ఆ ఏడుకొండల వాడే జగన్ ను ఓడించి ఇంటికి పంపించారని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అన్నారు. తిరుమల లడ్డూల తయారీలో ఇంతకాం జంతువుల కొవ్వు ఉపయోగించరానే విషయంపై సమగ్ర దర్యాప్తు జరిగితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+