టీడీపీలో మరో అభ్యర్థి అవుట్ .. టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి
టికెట్ల పంచాయితీ టీడీపీలో తారస్థాయికి చేరుకుంది. జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. ఇప్పటికే టికెట్లు దక్కని నేతలు రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేయస్తున్నారు. టికెట్ ఆశించిన నేతలకు మొండిచెయి ఎదురుకావడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు. బీఫాం అందేలోపు ఎంతమంది అభ్యర్థులు మారతారో తెలియని పరిస్థితి టీడీపీలో నెలకొంది.
ఇప్పటికే పి.గన్నవరం అభ్యర్థి రాజేష్ మహాసేన పేరును ప్రకటించిన తరువాత ఆ స్థానాన్ని జనసేనకు కేటయించడం జరిగింది. ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. టీడీపీలో ఉండి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా రామరాజు పేరు ప్రకటించారు. రామరాజు గత ఎన్నికల్లో జగన్ హవాను తట్టుకుని మరి టీడీపీ తరుఫున విజయం సాధించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉండి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరునే ఖారారు చేశారు.

అయితే వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామ కృష్ఱంరాజు టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. రామరాజు టికెట్‌ని కాస్తా రఘురామకృష్ణంరాజుకి కట్టబెడుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తీసుకున్నఈ నిర్ణయంతో ఎమ్మెల్యే రామరాజు మైండ్ బ్లాంక్ అయింది. దీనిపైన స్పందించిన ఎమ్మెల్యే రామరాజు 2019లో తాను ఇక్కడ్నుంచి గెలిచానని, ఈసారి కూడా విజయావకాశాలు తనకే ఉన్నాయని చెబుతున్నారు. రఘురామరాజు కోసం తనని బలిచేయడం కరెక్ట్ కాదంటున్నారాయన.
దీనిపై పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో మంగళవారం కార్యకర్తలతో రామరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రామరాజు మీడియాతో మాట్లాడారు. నా నియోజకవర్గ నుంచి వేరొకరికి టికెట్ కేటాయించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమయ్యింది.కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా. వారే నా కుటుంబ సభ్యులు... వారు చెప్పినట్లు చేస్తా.రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications