ప్రధాని మోడీతో ఎంపీ కేశినేని నాని భేటీ-కుటుంబంతో కలిసి ఫొటోలు-పార్టీ మార్పుపై మళ్లీ ఊహాగానాలు ?

2019లో రెండోసారి విజయవాడ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా కనిపిస్తున్న కేశినేని నాని.. బీజేపీ నేతలతో టచ్ లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

విజయవాడ : ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిని తట్టుకుని టీడీపీ ఎంపీలుగా గెలిచిన ముగ్గురిలో ఒకరైన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని గతంతో పోలిస్తే సైలెంట్ అయిపోయారు. అంతే కాదు గతంలో టాటా ట్రస్ట్ వంటివారిని తీసుకొచ్చి తన ఎంపీ సీటు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టిన నాని.. ఈసారి మాత్రం ఆ దూకుడు చూపించడం లేదు. అదే సమయంలో పార్టీలో తన వ్యతిరేకులకు చంద్రబాబు పెద్ద పీట వేయడంపై ఆగ్రహంగా ఉన్న నాని.. బీజేపీలోకి వెళ్లిపోతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది.

విజయవాడ ఎంపీ కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని

విజయవాడ రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న ఎంపీ కేశినేని నాని ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటున్నారు. దీనికి కారణం స్ధానికంగా మారుతున్న పరిస్ధితులే. ఆయన సోదరుడు కేశినేని చిన్ని ప్రత్యర్ధిగా మారి, సొంత పార్టీలో శత్రువులుగా మారిన వారితో చేతులు కలపడం, మళ్లీ వీరందరినీ అధినేత చంద్రబాబు దూరం పెట్టకుండా, చర్యలు తీసుకోకుండా వదిలేస్తుండటంతో నానితో అసంతృప్తి పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం మొదలైంది. అందుకు తగినట్లుగానే ఢిల్లీలో బీజేపీ నేతలతో పరిచయాలు పెంచుకోవడం, వారితో టచ్ లో ఉంటున్నట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.

ప్రధాని మోడీతో కేశినేని ఫ్యామిలీ భేటీ

ప్రధాని మోడీతో కేశినేని ఫ్యామిలీ భేటీ

ప్రధాని మోడీతో ఇవాళ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఢిల్లీలో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో కేశినేని నానితో పాటు ఆయన సతీమణి, కుమార్తె శ్వేత, అల్లుడు కూడా ఉన్నారు. తాజాగా పెళ్లి చేసుకున్న కేశినేని కుమార్తె శ్వేత దంపతులు ప్రధాని మోడీ ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు హడావిడిగా వీళ్లంతా కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ మొదలైంది. విజయవాడ ఎంపీ స్ధానంలో బీజేపీ ఎంపీగా అవకాశం వస్తే పోటీ చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో కేశినేని నాని ప్రధాని మోడీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బీజేపీలోకి లైన్ క్లియర్ అయిందా ?

బీజేపీలోకి లైన్ క్లియర్ అయిందా ?

కేశినేని నాని బీజేపీలోకి ఇప్పటికిప్పుడు వెళ్లే అవకాశాలు లేకపోయినా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ మారే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ కూడా ఏపీలో సీనియర్ నేతల్ని పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ కు రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేసింది. ఇప్పుడు కేశినేనిని కూడా లైన్ క్లియర్ చేసి తమ పార్టీలోకి తీసుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి చంద్రబాబుకు విధేయుడిగానే కనిపిస్తున్న కేశినేని నాని.. ఎన్నికల నాటికి పార్టీ మారతారా లేదా అన్న దానిపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+