వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పా డిమాండ్లకు టిడిపి నో, ఆపరేషన్.. జగన్‌కు అలా షాకిచ్చే వ్యూహం!

టిడిపి నేత, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపిలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన షరతులకు టిడిపి అంగీకరించే పరిస్థితి లేదంటున్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: టిడిపి నేత, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపిలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన షరతులకు టిడిపి అంగీకరించే పరిస్థితి లేదంటున్నారు. ఇలా షరతులకు తలొగ్గితే మొదటికే మోసం వస్తుందని అధిష్టానం భావిస్తోందని సమాచారం.

సాక్షి పత్రిక ప్రింటింగ్ ఖర్చు శిల్పా లెక్కలోకి: వైసిపికి 'టిడిపి' షాక్సాక్షి పత్రిక ప్రింటింగ్ ఖర్చు శిల్పా లెక్కలోకి: వైసిపికి 'టిడిపి' షాక్

చక్రపాణిని టిడిపిలోనే ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ షరతులకు మాత్రం ఓకే చెప్పడం ఇష్టం లేదని తెలుస్తోంది.

చక్రపాణి రెడ్డిని నమ్మటం లేదా?

చక్రపాణి రెడ్డిని నమ్మటం లేదా?

ఇప్పటికే శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరారని, ఇలాంటప్పుడు చక్రపాణి రెడ్డిని నమ్మలేమని భూమా అఖిలప్రియ వర్గం భావిస్తోందని సమాచారం. కాబట్టి ఆయన వెళ్లినా నష్టం ఏమీ లేదనే అభిప్రాయం నంద్యాల టిడిపి నేతల్లో ఉందని అంటున్నారు.

బుజ్జగింపులు అంతేనా

బుజ్జగింపులు అంతేనా

మరోవైపు, శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో టిడిపి అప్రమత్తమయింది. టిడిపి నాయకులు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు. కానీ చక్రపాణి రెడ్డి మాత్రం వైసిపిలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

జగన్ సమక్షంలో..

జగన్ సమక్షంలో..

3వ తేదీన జగన్ రోడ్‌ షో నిర్వహిస్తారు. ఎస్‌పీజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. ఈ సభలోనే జగన్‌ సమక్షంలో శిల్పా చక్రపాణి రెడ్డికి వైసిపిలో చేరుతారని భావిస్తున్నారు.

వారికి టిడిపి గాలం

వారికి టిడిపి గాలం

ఇదిలా ఉండగా, శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపిలో చేరితే.. ఆ పార్టీకి షాక్‌ ఇచ్చేందుకు టిడిపి ఎత్తులు వేస్తోందని సమాచారం. శిల్పాను వైసీపీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న వైసిపి కీలక నాయకులకు గాలం వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే జరిగితే జిల్లాలో ఉప ఎన్నిక సరికొత్త రాజకీయ సమీకరణాలకు వేదికగా మారుతుందంటున్నారు.

English summary
It is said that Telugu Desam Party is planning Operation Akarsh in Nandyal, who are disappointed with Silpa Chakrapani Reddy's joining rumors
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X