కీలక పదవుల్లో మార్పులు - చంద్రబాబు కొత్త టీం..!!
తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులకు రంగం సిద్దమైంది. కూటమి లో భాగస్వామిగా ఉంటూనే పార్టీ పరంగా అమలు చేయాల్సిన నిర్ణయాలు.. ప్రజలతో మమేకంతో పాటుగా పార్టీలో పదవుల్లో యువతకు ప్రాధాన్యత దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. పార్టీలో యువతకు ప్రాధాన్యత అంశం ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత ఎమ్మెల్యేలకు పార్టీ కొత్త బాధ్యత లు అప్పగించనుంది. పార్టీ పదవుల విషయంలో లోకేష్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఇప్పుడు సీనియర్ల విషయంలో నిర్ణయం చంద్రబాబుకు వైఖరి స్పష్టం చేయనున్నారు.
తప్పుకునేందుకు లోకేష్ సిద్దం
తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశం ఆసక్తిగా మారుతోంది. ఈ రోజు జరిగే సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. పార్టీ సంస్థాగత అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. పార్టీలో పదవుల విషయంలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చేలా లోకేష్ తాజాగా కీలక ప్రతిపాదన చేసారు. ఎవరైనా ఒకే పదవిలో మూడు సార్లు మించి కొనసాగకూడదని ప్రతిపాదన చేసారు. అందులో భాగంగా తాను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.

చంద్రబాబు కొత్త టీం
లోకేష్ చేసిన ఈ ప్రతిపాదన పైన పాలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్లు పలువురు కీలక పదవుల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. లోకేష్ ప్రతిపాదనతో వారు తమ పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. వారి స్థానంలో యువతకు ప్రాధాన్యత దక్కాలనేది తాజా ఆలోచనగా తెలుస్తోంది. దీంతో, ఈ ప్రతిపాదన పైన సీనియర్ల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది పార్టీలో ఆసక్తి కర చర్చగా మారుతోంది. పదవుల నుంచి తప్పుకునే సీనియర్లకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు.. చంద్రబాబు వారి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. దీంతో, కొత్త టీం రూపకల్పన దిశగా చంద్రబాబు తన ఆలోచన వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
ఎమ్మెల్యేలకు బాధ్యతలు
పాలిట్ బ్యూరోలనూ మార్పులు ఉంటాయనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. దీంతో, ఈ రోజు జరిగే భేటీ కి ప్రాధాన్యత పెరుగుతోంది. అదే విధంగా పార్టీలో కోటి మంది సభ్యత్వం.. సంస్థాగత ఎన్నికల పైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు సైతం ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీని పైన నేటి భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరు.. మిత్రపక్షాలతో సమన్వయం గురించి చర్చ చేసి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నందమూరి బాలయ్యకు పోలిట్ బ్యూరో అభినందించనుంది.












Click it and Unblock the Notifications