ఇంటివద్దకే రూ.4,000ల పింఛన్ తెచ్చి ఇస్తాం

Chandrababu Naidu: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- పింఛన్ల పంపిణీ వ్యవహారం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకున పెడుతోంది. రాష్ట్రంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.

అసెంబ్లీ, లోక్‌సభ ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో వలంటీర్ల ద్వారా పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేయడం సరికాదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు సానుకూలంగా స్పందించారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

TDP promises Rs 4000 pension at home to the beneficiaries

దీనితో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి పింఛన్ మొత్తాన్ని ఇవ్వడానికి బదులుగా సచివాలయం వద్ద ఆ మొత్తాన్ని పంపిణీ చేసే ఏర్పాట్లు తీసుకుంది. ఈ మేరకు కొత్తగా గైడ్‌లైన్స్ జారీ చేసింది.

పింఛన్ల వ్యవహారంతో పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. అటు వలంటీర్లు, ఇటు లబ్దిదారులపై హామీలను ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతామని తెలిపింది టీడీపీ. ఈ మొత్తాన్ని కూడా ప్రతి నెలా ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని పేర్కొంది.

రెండు మూడు నెలలు తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని కూడా కలిపి లబ్దిదారులకు అందిస్తామని స్పష్టం చేసింది టీడీపీ. వలంటీర్ల విషయంలో తమకు ఓ స్పష్టత ఉందని, ఈ వ్యవస్థను తాము కొనసాగిస్తామనీ భరోసా ఇచ్చింది. వలంటీర్లకు ఇంతకంటే మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+