కేసుల మాఫీ చుట్టే జగన్ రాజకీయం: రావుల
హైదరాబాద్/ విజయవాడ: కేంద్రంలో మద్దతు విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తరచూ మాట మారుస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. జగన్ మొదట యూపీఏ అన్నారని, తర్వాత థర్డ్‌ఫ్రంట్, ఫెడల్ ఫ్రంట్ అన్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
ఇప్పుడు బిజెపి అంటూ తరచూ మాట మారుస్తారని ఆయన మండిపడ్డారు. రాజకీయమంటే స్టాక్ ఎక్సేంజ్ కాదని ఆయన హితవు చేశారు. జగన్ రాజకీయమంతా కేసుల మాఫీ చుట్టు తిరుగుతోందని ఎద్దేవా చేశారు. రైతుల రుణాల మాఫీపై జగన్ అయోమయం సృష్టిస్తున్నారని రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. దేశం, రాష్ట్రం బాగుపడాలంటే మోదీ-చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆయన సోమవారం విజయవాడలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆకాంక్షించారు.
కాంగ్రెస్ అసమర్థ పాలనలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని మండిపడ్డారు. కుంభకోణాలతో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందన్నారు. కొత్త రాజధాని నిర్మాణం చంద్రబాబుకే సాధ్యమని ఆర్.కృష్ణయ్య అన్నారు.












Click it and Unblock the Notifications