వైసీపీలో చేరిన టీడీపీ మాజీ మంత్రి అన్న కుమారుడు: మంత్రి బాలినేని సమక్షంలో: త్వరలో ఆయన కూడా.. !
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు త్వరలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తోన్న వేళ.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శిద్ధా రాఘవరావు సోదరుడి కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్ధా హనుమంత రావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువాను కప్పుకొన్నారు.

ప్రకాశం జిల్లా టీడీపీలో ప్రకంపనలు..
శిద్ధా రాఘవరావు గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు రావడం, కొన్ని రోజుల్లోనే శిద్ధా హనుమంత రావు వైసీపీలో చేరడం వంటి కీలక పరిణామాలు వెంట వెంటనే చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో కలకలాన్ని రేపాయి. జిల్లాకు చెందిన కొందరు పార్టీ సీనియర్ నాయకులు శిద్ధా రాఘవరావుకు సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆయన అందుబాటులో లేకుండా పోయినట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే ఆయన కూడా వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారనే అభిప్రాయాలు జిల్లా రాజకీయాల్లో వ్యక్తమౌతున్నాయి.

టీడీపీకి విఘాతంలా..
మొన్నటికి మొన్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన కదిరి బాబురావు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ మరుసటి రోజే జిల్లాకే చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్, మాజీమంత్రి పాలేటి రామారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకొన్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన శిద్ధా రాఘవరావు పార్టీని వీడే అవకాశాలు ఉండటం టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు.

టీడీపీ పట్టించుకోకపోవడం వల్లే..
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ కుమార్ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి రాఘవరావు, కనిగిరి అసెంబ్లీ సీటు నుంచి సుధీర్ కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తరువాత పార్టీ తనకు అండగా ఉండట్లేదనే అసంతృప్తి శిద్ధా రాఘవరావులో నెలకొని ఉందని, టీడీపీలోనే కొనసాగితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఉండదనే ఉద్దేశంతోనే పార్టీ ఫిరాయించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Recommended Video

సోదరుడి కుమారుడితో బోణీ..
ఈ పరిణామాల మధ్య శిద్ధా రాఘవరావు అన్న కుమారుడు హనుమంతరావు వైసీపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికోసం హనుమంతరావు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి మరీ.. ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు పారిశ్రామికవేత్త శిద్దా హనుమంతరావు తెలిపారు. శిద్ధా రాఘవరావు కూడా వైసీపీలో చేరతారా? లేదా? అనే అంశంపై తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications