ప్రత్యేక హోదా: పవన్ కళ్యాణ్‌కు టిడిపి దమ్కీ! కాంగ్రెస్ పైకి నెపం
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ దమ్కీ ఇచ్చిందా? అంటే వారి వ్యాఖ్యలను బట్టి అవుననే అంటున్నారు. ప్రత్యేక హోదా కోసమని ఏపీ టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి, ఆ తర్వాత విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడిన తీరు చర్చనీయాంశమవుతోంది.
ప్రత్యేక హోదా కోసం టిడిపి ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందని కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ నిలదీశారు. టిడిపి ఎంపీల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ నిలదీసిన నేపథ్యంలో.. టిడిపి ఎంపీలు కేంద్రాన్ని నిలదీయవచ్చునని చాలామంది అభిప్రాయపడ్డారు.

అయితే, జెసి దివాకర్ రెడ్డి షాకిచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల నోరు మూయించేందుకే ఇటువంటి ధర్నాలు అని వ్యాఖ్యానించారు. తద్వారా ఆయన వ్యాఖ్యలు అందరికీ షాకేనని చెప్పవచ్చు. మొక్కుబడిగా ఆందోళనలు చేస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తోందని అంటున్నారు.
మరోవైపు, సుజనా చౌదరి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని అడగాలంటే, మొదట సమావేశాలు సజావుగా సాగాలి కదా అని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి, టిడిపి మిత్రపక్షంగా ఉందని చెప్పారు. పార్లమెంటును కాంగ్రెస్ పార్టీ స్తంభించడం వల్లనే సమస్యను ప్రస్తావించలేకపోతున్నామని నెపం కాంగ్రెస్ పైకి నెట్టేశారు.












Click it and Unblock the Notifications