వ్యవసాయ బిల్లులపై టీడీపీ యూటర్న్- కేంద్రం సవరణలు చేయాలన్న సోమిరెడ్డి
కేంద్రం పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ బిల్లులపై పంజాబ్, హర్యానా, యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో అన్నదాతలు నిరసనలకు దిగుతున్నారు. కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఈ నెల 8న భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. దీంతో రైతుల నిరసనల సెగ ఇప్పుడు అన్ని పార్టీలనూ తాకుతోంది. ముఖ్యంగా గతంలో వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చిన టీడీపీ ఈ విషయంలో యూటర్న్ తీసేసుకుంది.
ఢిల్లీలో రైతుల పోరాటంపై టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ 9 రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నారని, వారు ప్రాణాలకు లెక్కచేయకుండా పోరాడుతున్నారని సోమిరెడ్డి తెలిపారు. అధికారులు భోజన సౌకర్యం కల్పిస్తామన్నా నిరాకరించి పట్టుదలగా రైతులు ఉద్యమిస్తున్నారని సోమిరెడ్డి ప్రశంసించారు. కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ బిల్లులు తెచ్చిందో తెలియదు కానీ సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

కార్పోరేట్ సంస్ధలు రైతులకు పెట్టుబడులు పెట్టి తిరిగి వారి ఉత్పత్తులను కొనే విషయంలో కనీస మద్దతు ధరకు కట్టుబడి ఒప్పందాలు చేసుకోవాలని సోమిరెడ్డి సూచించారు. పేదల రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని కార్పోరేట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా వదిలేయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రైవేటు సంస్ధలు ఎంత సరుకైనా నిల్వ చేయవచ్చనే సౌలభ్యం వినియోగదారులకు భారంగా మారే ప్రమాదముందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన విధానంతో వ్యవసాయ బిల్లులకు కేంద్రం సవరణలు చేయాలని సూచించారు..
రైతుల విషయంలో కేంద్రం పట్టువిడుపులతో వ్యవహరించి సత్వర నిర్ణయం తీసుకోవాలని సోమిరెడ్డి సూచించారు. గతంలో వ్యవసాయ బిల్లులకు బేషరతుగా పార్లమెంటులో మద్దతు తెలిపిన టీడీపీ ఇప్పుడు సవరణలు ప్రతిపాదించడం ఆసక్తి కరంగా మారింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications