వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడివాడలో టీడీపీ నేతల రాజీ ఫార్ములా - టార్గెట్ కొడాలి నాని : అభ్యర్ధి ఫైనల్ దిశగా..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గుడివాడలో గెలవాలనే పట్టుదలతో ఉంది. కానీ, నియోజవకర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి సమస్యగా మారుతోంది. మాజీ మంత్రి కొడాలి నాని లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. టీడీపీ.. ప్రధానంగా చంద్రబాబు పైన విరుచుకుపడే మాజీ మంత్రి కొడాలి నాని పైన టీడీపీ ఫోకస్ చేసింది. కొద్ది రోజుల క్రితం నియోజకవర్గ మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. ఇందు కోసం ఏర్పాట్ల సమయంలోనే పార్టీ నేతల మధ్య విభేదాలు బయట పడ్డాయి.

గుడివాడలో నేతల మధ్య దూరం

గుడివాడలో నేతల మధ్య దూరం


ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో నేతల మధ్య అంతర్గతంగా తలెత్తిన విభేదాల పరిష్కారం కోసం పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకుంది. ఇక, వర్షాల కారణంగా పార్టీ మహానాడు వాయిదా పడింది. తిరిగి..త్వరలోనే నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తిరిగి నియోజకవర్గ నేతలతో టీడీపీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. సమన్వయం కోసం టీడీపీ అధినేత నియమించిన కమిటీలోని సభ్యులు యనమల, టీడీ జనార్దన్ గుడివాడ టీడీపీ నేతలు రావి వేంకటేశ్వరావు, మాజీ మంత్రి పన్నిమనేని వేంకటేశ్వర రావు, పిన్నమేని బాబ్జీతో ఈ సమావేశం నిర్వహించారు. తమను నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు కలుపుకొని వెళ్లటం లేదంటూ వారు ఫిర్యాదు చేసారు.

కొడాలి నాని టార్గెట్ గా పని చేయండి

కొడాలి నాని టార్గెట్ గా పని చేయండి


అయితే, రావి వాదన మరోలా ఉంది. వారే కలిసి రావటం లేదని..ప్రత్యర్ధి పార్టీ వారితో సన్నిహితంగా ఉంటున్నారంటూ ఆరోపించారు. రెండు వర్గాలు ఒకరి పైన మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తరువాత పార్టీ ముఖ్య నేతలు నచ్చ చెప్పటంతో..కలిసి పని చేసేందుకు రెండు వర్గాలు రాజీకి వచ్చాయి. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి అభ్యర్ధి ఎవరనేది ఇప్పుడు చర్చ మొదలైంది. అసలు టీడీపీకి గుడివాడలో టీడీపీ లేరంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాశ్ పోటీ చేసారు. ఆ తరువాత అవినాశ్ వైసీపీలో చేరారు. ఇప్పుడు అక్కడ అభ్యర్ధి ఎంపికలో టీడీపీ ఆచూతూచి అడుగులు వేస్తోంది.

అభ్యర్ధి ఎంపికపై ఆచి తూచి

అభ్యర్ధి ఎంపికపై ఆచి తూచి


తొలుత నందమూరి కుటుంబం నుంచే ఇక్కడ పోటీకి దింపాలని భావించినా...ఇప్పుడు మాత్రం కొత్త వ్యూహం అమలు చేస్తోంది. పొత్తుల సంగతి తేలిన తరువాతనే గుడివాడ అభ్యర్ధి పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. తాజాగా.. రోడ్ల దుస్థితి పైన క్యాంపెయిన్ చేస్తున్న జనసేన స్థానిక నేతలు నేరుగా కొడాలి నాని ఇంటి వద్ద నిరసనకు దిగారు. నేరుగా నియోజకవర్గంలో టీడీపీ నేతలు గతంలో ఎన్నడూ చేయని విధంగా జనసేన నేతలు ముందుకు కదలటం ఇప్పుడు గుడివాడ కేంద్రంగా రాజకీయ సంచలనం గా మారింది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో..కొడాలి నానికి ధీటైన అభ్యర్ధిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రత్యేకంగా ఇక్కడ సర్వేలు చేయిస్తోంది. మహానాడు నిర్వహణ సమయంలోగా పార్టీ నేతల మధ్య ఐక్యత కనిపించాలని పార్టీ నిర్దేశించింది.

English summary
TDP Hi command focus on Gudivada constituency, suggeted local leaders to work unitedly against Kodali Nani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X