ఏపీలో కూటమికి వచ్చే సీట్లివే.. టీడీపీ ఉగాది పంచాంగ శ్రవణంలో జోస్యం..!

ఏపీలో ఉగాది సంబరాలు మిన్నంటుతున్నాయి. తెలుగు వారి కొత్త ఏడాది క్రోధ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో పంచాగ శ్రవణాలు కూడా ఏర్పాటు చేసి ఈ ఏడాది తమకు ఎలా ఉండబోతోందో చెప్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఉగాది వేడుకల్లో చంద్రబాబుకు వేద పండితులు ఉగాది పచ్చడి అందించారు. పంచాగకర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబుకు ఈ ఏడాది కలిసి వస్తుందన్నారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని తెలిపారు. త్రిమూర్తులు కలయికతో ఏపీకి మేలు జరుగుతోందని వెల్లడించారు. బ్రహ్మ - మోడీ, విష్ణువు - పవన్, ఈశ్వరుడు - చంద్రబాబుగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమికి 128 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంట్ స్థానాలు వస్తాయన్నారు. అలాగే చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపడతారన్నారు.

tdp ugadi celebrations- pandits reveal how many seats nda alliance winning in ap

అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. తెలుగు ప్రజలకు క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమిగా కలసి వస్తున్నామన్నారు. వైసీపీ వ్యతిరేక ಓటు చీలకూడదని కూటమిగా వస్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరమన్నారు. సూపర్ సిక్స్ తోపాటు త్వరలోనే ఎలక్షన్ మ్యానిఫెస్టో తీసుకు వస్తామని తెలిపారు.

tdp ugadi celebrations- pandits reveal how many seats nda alliance winning in ap

ప్రజలపై అప్పుల భారం లేకుండా మెరుగైన సంక్షేమం అందించేలా ముందుకెళ్తామన్నారు. కనీసం తాగునీళ్లు ఇవ్వలేని సీఎం...మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+