50సీట్లు గెలుస్తామని బాబు, ఫోటో తీసిన గర్ల్స్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో జాతీయ పార్టీగా అవతరిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ దేశంలో 70 నుండి 100 సీట్లకు పోటీ చేసి 40 నుండి యాభై సీట్ల వరకు గెలుచుకుంటుందన్నారు.
తెలంగాణలో టిడిపిని లేకుండా చేసి దోచుకుందామనే తెరాస ఆటలను సాగనీయబోమన్నారు. సీమాంధ్రకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూనే తెలంగాణలో సైతం పార్టీని పటిష్ఠంగా తీర్చుదిద్దుతానని పేర్కొన్నారు. తాను తెలంగాణలోనే ఉంటానని స్పష్టం చేశారు.
పార్టీని నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయడం, నమ్ముకున్న కార్యకర్తలను పైకి తీసుకురావడం తన విద్యుక్త ధర్మమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశాన్ని జాతీయపార్టీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

చంద్రబాబు
దేశంలో 70 నుంచి 100 సీట్లకు పోటీ చేసి 40 నుంచి 50 సీట్లను సాధించుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు
రానున్న రోజుల్లో టిడిపిని బలపరిచే వ్యక్తి దేశ ప్రధాని అవుతారని.. బిజెపితో పొత్తు విషయంలో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

చంద్రబాబు
గతంలో అవగాహనతో పోటీ చేసిన సమయంలో తెలుగుదేశం 29, బిజెపి 7 లోకసభ సీట్లను గెలుపొందిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

చంద్రబాబు
దేశం అభివృద్ధి చెందాలనేదే తమ ప్రధాన ధ్యేయమని.. కాంగ్రెస్‌కు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ గట్టి నాయకత్వం లేదని అన్నారు.

చంద్రబాబు
సీమాంధ్రలో టిడిపి విజయం ఏకపక్షమని.. తెలంగాణలో సైతం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు. మాట మీద నిలబడిన టిడిపి... లేఖ ఇచ్చి దానికి కట్టుబడి ఉందన్నారు.

చంద్రబాబు
టిడిపి ద్వారా కెసిఆర్ లబ్ధి పొందారని.. నాయకులు వెళ్లినా కార్యకర్తలే బలంగా పార్టీ పటిష్ఠంగా ఉందన్నారు. తమను దెబ్బతీయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ గోతిలోపడిందని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు
కాంగ్రెస్ పరిస్థితి దీనావస్థలో ఉందని టీఆర్ఎస్ కాళ్లు పట్టుకునే పరిస్థితికి చేరుకుందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ఉప ఎన్నికల పార్టీ అని.. రానున్న జనరల్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు.

చంద్రబాబు
టిడిపితో సామాజిక తెలంగాణ సాధించడం, బిసి అభ్యర్థిని సీఎంగా చేయడం వంటి చర్యలతో టిడిపి బడుగు బలహీనవర్గాలపై చిత్తశుద్ధి కలిగి ఉందన్నారు.

చంద్రబాబు
తెలంగాణ రాష్ట్ర సమితిలో నాయకులు లేరని.. తమకు వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి, రేవూరి, వేము నరేందర్ రెడ్డి వంటివారెందరో ఉన్నారన్నారు.

చంద్రబాబు
టిడిపిలో చెల్లని కాసులు తెరాస, కాంగ్రెస్‌ల్లోకి వెళ్లి పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్నారని.. టిడిపి నుంచి వెళ్లిన వారు జగన్ పార్టీ సలహాదారులుగా మారారని పేర్కొన్నారు.

చంద్రబాబు
ఎన్టీఆర్ భవన్‌లో టిడిపి 33వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. చంద్రబాబు పతాకావిష్కరణ చేసి, కేక్ కట్ చేశారు.

చంద్రబాబు
అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డెంటల్ డాక్టర్ల అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ దేశం ఆరోగ్యంగా ఉంటుందో ఆ దేశం సంపద సృష్టించే దేశంగా మారుతుందన్నారు.

చంద్రబాబు
మన దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని అన్నారు. వైద్య సేవలను ప్రాథమిక హక్కులో చేర్చేలా రాజ్యాంగ సవరణ చేస్తామని అని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications