బాత్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన ఉపాధ్యాయుడు..

పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు విద్యా బుద్దులు నేర్పి పిల్ల‌ల‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్దాల్సిన ఓ గురువు దారిత‌ప్పాడు. అదే స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థినిపై అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా ఆ చిన్నారిపై అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డ్డాడు. గురువు అంటే పిల్ల‌ల‌ను ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్దాలి. పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌న తీరు మార్చే బాధ్య‌త వారిపై ఉంటుంది. అలాంటి వారే చెడుదారిలో న‌డిస్తే రేప‌టి పౌరుల‌కు వారు నేర్పించే విలువ‌లేంటీ... స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా ప్ర‌వ‌ర్తించాడు ఆ ఉపాధ్యాయుడు. స్కూల్లోని ఓ విద్యార్థిని కాల‌కృత్యాలు తీర్చుకునేందుకు బాత్‌రూమ్‌కి వెళ్ల‌గా, ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఆ స్కూల్ ఉపాధ్యాయుడు బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఆ చిన్నారిపై అత్యాచార‌య‌త్నానికి ప్ర‌య‌త్నించాడు. ఈ సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది.

చిన్నారిపై ఉపాధ్యాయుడి అత్యాచార‌య‌త్నం...:ఈ ఘ‌ట‌న ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. మ‌ద్దిపాడు మండ‌లం పెద్ద కొత్త‌ప‌ల్లి పంచాయితీ ప‌రిధి అంజ‌య్య‌న‌గ‌ర్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు సుంద‌ర‌బాబు. బాత్రూమ్‌లోకి వెళ్లిన ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగాక‌రంగా ప్రవర్తించాడు. దీంతో షాక్‌కు గుర‌యిన ఆ చిన్నారి వెంట‌నే తల్లిదండ్రులకు ఉపాధ్యాయుడి గురించి చెప్పింది.

Teacher tries to assault a student when she goes to washroom Prakasam dist of AP

దీంతో వెంట‌నే ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు, గ్రామ‌స్థులు అంతా క‌లిసి పాఠ‌శాల‌కు హుటాహుటిన వెళ్లి సుంద‌ర‌బాబు అనే ఉపాధ్యాయుడికి దేహ‌శుద్ధి చేశారు. ఆ త‌ర్వాత ఉపాధ్యాయుడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సుంద‌ర‌బాబు అనే ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు, గ్రామ‌స్థులు డిమాండ్ చేశారు. పోలీసు అధికారుల వాహనాన్ని గ్రామస్థులు కొద్దిసేపు అడ్డుకోవ‌డం జ‌రిగింది. దీంతో సమాచారం తెలుసుకున్న జిల్లా ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ సుందరబాబుని సస్పెండ్ చేశారు. పోలీసు అధికారులు ఆ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఆ ఉపాధ్యాయుడు ఇదే విధంగా ప్రవర్తించినట్లు కొన్ని ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+