ప్రియుడితో పెళ్లికి కట్నం అడ్డు, టెక్కీ ఆత్మహత్య: కోరిక తీర్చలేదని మరదలిపై దాడి

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కుటుంబం కట్నం అడిగిందని ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలలోని కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో ఈ సంఘటన జరిగింది. మృతి చెందిన యువతి బెంగళూరులో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది.

బాధితురాలు, ప్రియుడు చిన్ననాటి నుంచి కలసి చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక ఒకేచోట ఉద్యోగాలు పొందారు. వారి మధ్య ప్రేమ చిగురుంచింది. సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే, ప్రియుడితో పెళ్లి కోసం మృతురాలిని కట్నం అడిగినట్లుగా తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి నేడు ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పేరు వెంకటేష్ అని తెలుస్తోంది. మృతురాలి పేరు కోమలి.

Techie commits suicide in AP

వీరిద్దరు కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం చేసుకోవాలనుకున్న సమయంలో వెంకటేష్ తల్లిదండ్రులు కట్నం కావాలని డిమాండ్ చేశారని తెలుస్తోంది. అందుకు వెంకటేష్ నుంచి కూడా కొంత ఒత్తిడి వచ్చిందని చెబుతున్నారు.

దీంతో బాధపడిన కోమలి... ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుంది. ఆమె దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చింది. సెలవులకు వచ్చిన కోమలి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరదలి గొంతుకోసి బావ ఆత్మహత్య

శృంగవరపుకోట మండలం ముసిడిపల్లిలో దారుణం జరిగింది. తమ్ముడి భార్య (మరదలు) పైన బావ అ్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించగా.. దానికి ఆమె నిరాకరించింది. దీంతో మరదలి పైన బావ దాడి చేశాడు. అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బావ కొద్ది రోజులుగా సదరు మరదలిని కోరిక తీర్చమని ఆమె వెంటపడుతున్నాడు. ఆమె అంగీకరించకపోగా... పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతను మరోసారి ఆమె వద్దకు వెళ్లి... గొంతుకోశాడు. ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+