మనస్తాపానికి గురై టెక్కీ ఉరేసుకుని ఆత్మహత్య
విజయవాడ: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాచవరంలో చోటుచేసుకుంది. కుటుంబంలో నెలకొన్న సమస్యలతో తీవ్ర మనస్తాపం చెందిన కొమ్మరి కృష్ణమూర్తి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రమాదంలో కార్మికుడి మృతి
విద్యుత్ స్తంభం పైకెక్కి మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని పొదలకూరు మండలం అంకుపల్లిలో చోటుచేసుకుంది. అబ్దుల్(27) అనే ప్రైవేటు కార్మికుడు విద్యుత్ సరఫరాలో సమస్య ఉండడంతో పోల్ పైకెక్కి మరమ్మతు చేస్తున్నాడు.

ఈ క్రమంలో పట్టుతప్పి ఒక్కసారిగా కిందపడి మృతిచెందాడు. దీంతో కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు అబ్దుల్ మృతదేహంతో విద్యుత్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నెలో ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, ట్రాక్టర్ ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బనగానపల్లె మండలం మీరాపురం వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications