డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని లాడ్జిలో టెక్కీ ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఓ లాడ్జిలో చెన్నైలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది బుధవారం నాడు వెలుగు చూసింది. నెల్లూరు గ్రామీణ మండలం రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి చెంచురామయ్య, వల్లి దంపతుల తనయుడు భరద్వాజ్.

అతను ఎంటెక్‌ పూర్తి చేసి మూడేళ్లుగా చెన్నైలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇతను తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఆదివారం (24వ తేదీ) రాత్రి తిరిగి చెన్నై బయలుదేరారు. నాయుడుపేట బస్టాండ్ ఎదురుగా ఉన్న లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు.

Techie commits suicide in Nellore district lodge

తర్వాత రోజు బయటికి వెళ్లి వచ్చిన అతను, మధ్యాహ్నాం నుంచి అతను గది తలుపులు తీయకుండా లోపలే ఉన్నారు. కూల్ డ్రింకులో పురుగు మందు కలిపి తాగి బాత్ రూంలో మృతి చెందారు. బుధవారం ఉదయం లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి గది వద్దకు వెళ్లింది. వాసన వచ్చింది.

పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి అతను ఉన్న గది తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. అతను ఇంటి నుంచి వెళ్లే సమయంలో సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టి వచ్చారు. దీంతో, చెన్నైలో అతను పని చేసే కంపెనీ ప్రతినిధులు.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంకా ఆఫీస్‌కు రాలేదని చెప్పారు. కొడుకు మృతి చెందాడనే విషయం తెలుసుకొని వారు కన్నీరుమున్నీరు అయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Techie commits suicide in SPS Nellore district lodge.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి